చైనా యాప్స్ నిషేధంతో ఆ సెలబ్రిటీలపై గట్టి దెబ్బ పడబోతోందా…?

0

సినీ ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్స్ సినిమాలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. సినిమాలతో వచ్చే క్రేజ్ ని వాడుకొని రెండు చేతులా అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ముఖ్యం గా హీరోయిన్స్ విషయం లో కొంచెం ముందుంటారు. ఈ క్రమం లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లడం తో పాటు కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతుంటారు. అంతేకాకుండా కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి యాడ్స్ లలో నటిస్తుంటారు. ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ కొన్ని ఫేమస్ సోషల్ మీడియా యాప్స్ లలో అకౌంట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ యాప్స్ లో పోస్టులు పెడితే హీరోయిన్స్ కి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారట. అలానే అకౌంట్ ఓపెన్ చేసినందుకు కూడా భారీగానే చెల్లిస్తున్నారట. ముఖ్యంగా చైనా యాప్స్ అయిన టిక్ టాక్ హలో షేర్ చాట్ లాంటి యాప్స్ ద్వారా బాగానే క్యాష్ చేసుకుంటున్నారట. అయితే ఇప్పుడు అలాంటి వారి ఆదాయానికి గండి పడింది. కారణం ఇండియాలో 59 చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికం గా ప్రకటించింది.

దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వారి హెచ్చరికలతో చైనా యాప్స్ నిషేధించాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాన్ చేయబోయే చైనా యాప్స్ లిస్ట్ రిలీజ్ చేయగా వాటిలో టిక్ టాక్ హలో షేర్ చాట్ షేర్ ఇట్ లైక్ వి చాట్ వీగో వీడియో లాంటి యాప్స్ ఉన్నాయి. దీంతో వీటి ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్న సెలబ్రిటీలు ఇప్పుడు లబోదిబోమంటున్నారట. నిజానికి అప్ కమింగ్ హీరోయిన్లు మరియు కొద్దిగా క్రేజ్ ఉన్న హీరోయిన్లకు ఇది గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా అవకాశాలు తక్కువగా ఉండే వారికి ముఖ్య ఆదాయ వనరుగా భావించే ఈ యాప్స్ ప్రొమోషన్స్ కూడా పోయే సరికి ఈ కరోనా క్రైసిస్ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారట.
Please Read Disclaimer