‘బిగ్ బాస్’ హోస్ట్ కి చిన్మయి చీవాట్లు

0

మనిషి సైకాలజీ ఆధారంగా `బిగ్ బాస్` ఆడే వింతాటలో అందరూ పావులే. అందుకే ఈ ఆట ఆద్యంతం వివాదాల రచ్చ తప్పనిసరి. ఈ తరహాలోనే తమిళ బిగ్ బాస్ నిరంతరం వివాదాల మయం అవుతోంది. ఈ ఆట లో హోస్ట్ కమల్ హాసన్- కంటెస్టెంట్ శరవణన్ మధ్య సాగిన ఓ సంభాషణ వివాదాస్పదమైంది. ఆ ఇద్దరి మధ్యా జరిగిన ఓ సంభాషణను ఖండిస్తూ గాయని చిన్మయి ఫైరయ్యారు.

అంత ఇదిగా ఏం మాట్లాడుకున్నారు? అన్న వివరాల్లోకి వెళితే.. ఈ శని- ఆదివారాల ఎపిసోడ్స్ లో కమల్ హాసన్ బస్సుల్లో వెళ్లే మహిళల కష్టాల గురించిన టాపిక్ ని ప్రస్థావించారు. ఆడాళ్లు బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందికరం. ఆఫీస్ కి పరిగెత్తే తొందరలో వెళుతుంటే కొందరు చెప్పకూడని చోట టచ్ చేస్తారు! అని అన్నారు. దానికి ప్రతిగా స్పందించిన నటుడు శరవణన్.. అవును అలాంటి కొంటె పనులు నేను కూడా చేశాను. కాలేజ్ కి వెళ్లేప్పుడు బస్సుల్లో గాళ్స్ ని టచ్ చేసి ఆనందించేవాడిని. అయితే ఇప్పుడు అలా లేను. మారిపోయాను! అంటూ సింపథీ కోసం ప్రయత్నించాడు.

ఈ మొత్తం సంభాషణకు కారకుడైన హోస్ట్ కమల్ హాసన్ పైనా.. కంటెస్టెంట్ శరవణన్ పైనా చిన్మయి శ్రీపాద ఓ రేంజులో విరుచుకుపడ్డారు. అమ్మాయిని తడిమి ఆనందించడం అదేదో ఘనకార్యం అన్నట్టే చెప్పుకొచ్చారు. అతడికి చీవాట్లు పెట్టాల్సింది పోయి.. గొప్ప పని చేశావ్!! అంటూ పొగిడేశారు కమల్ అని విమర్శించారు. ఇక ఈ కార్యక్రమం చూసేవాళ్లు అదేదో గొప్ప జోక్ అన్నట్టు చప్పట్లు కొట్టారు! అంటూ ఆడియెన్ కీ చీవాట్లు వేశారు.
Please Read Disclaimer