గొడవల్రావు పై చిన్మయి నామినేషన్?

0

గాయని చిన్మయి శ్రీపాద నిరంతరం మీడియాలో హాట్ టాపిక్. మీటూ ఉద్యమంలో భాగంగా లిరిసిస్ట్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి నాటి నుంచి పురుషాధిక్య ప్రపంచాన్ని ఓ ఆటాడుకునే ప్రయత్నం చేశారు. దానికి నెటిజనుల నుంచి రకరకాల ట్రోల్స్ ఎదురైన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ ట్వీట్లు… కామెంట్లు సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లోనే వివాదాలతో టాప్ ప్లేస్ లో నిలించింది ఈ యువగాయని. మీటూ ఫైట్ లో చిన్మయి ట్వీట్లు ఒక్కొక్కటి తుటాల్లా పేలాయి. అటుపై రైటర్ కం సీనియర్ నటుడు రాధారవిపైనా సంచలన ఆరోపణలు చేసి వివాదాలకి కేంద్ర బిందువైంది. ఈ ఒక్క ఆరోపణతో చిన్మయి ఓ వైపు అయిపోతే…. కోలీవుడ్ అంతా మరోవైపు నిలిచింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ పైనే ఆరోపణలా? అంటూ చిన్మయిని యూనియన్ నుంచి బహిష్కరించారు.

కొన్ని నెలల పాటు వేటు నిషేధం విధించడంతో చిన్మయి అటువైపు వెళ్లకుండానే..ఆత్మ విశ్వాసం సడలకుండా న్యాయ పోరాటం చేసింది. కోలీవుడ్ కు ఇది నెగిటివ్ అయినా తన బాణీని వినిపిస్తూనే ఉంది. తాజాగా చిన్మయిపై నిషేధం తొలగిపోవడం…డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు సమీపించడంతో రాధారవిపైనే నామినేషన్ దాఖలు చేసింది. అధ్యక్ష పదవికి ఆయనకెదురెళ్లి పోటీ చేస్తుండడం రసవత్తరంగా మారింది. చిన్మయి తన బృందంతో కలిసి నామినేషన్ దాఖలు చేసింది. ఈ సమయంలో ఆఫీస్ గదిలో కాసేపు గందగోళం నెలకొంది.

చిన్మయి తన సహచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి గదిలోకి ప్రవేశించగానే ప్రత్యర్ధులు ఇబ్బందులకు గురిచేసారుట. దీంతో చిన్మయి టీమ్ అంతే ధీటుగా వాటిని ఎదుర్కుందట. దీంతో ఈసారి జరిగే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపించడం ఖాయమని తెలుస్తోంది. అసలే రాధారవి-చిన్మయి మధ్య వివాదం పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఏకంగా పెద్దాయనతో ఎన్నికల వార్ లోనే తలపడుతోంది. దీంతో చిన్మయి పేరు కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer