అన్నయ్యకు భలే బిస్కెట్ వేసాడే!

0

ఏరు దాటాక తెప్ప తగలేయడం.. ఊసరవెల్లిలా రంగులు మార్చడం సినిమావాళ్లకు కొత్తేమీ కాదని విమర్శలొస్తుంటాయి. అయితే ఇది నిజమేనని నిరూపించారు రచయిత కం రాజకీయనేత చిన్నికృష్ణ. ప్రస్తుతం వైకాపా తీర్థం పుచ్చుకున్న ఆయన మెగాస్టార్ చిరంజీవిని పొగిడేసిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు బురద జల్లి ఇప్పుడు మెగాస్టార్ ని పొగిడేయడమేమిటో అర్థం గాక అందరూ బుర్రలు పీక్కుంటున్నారు.

అసలింతకీ ఏమైంది? అంటే.. ఇటీవలే చిన్నికృష్ణ ఓ పబ్లిక్ మీట్ పెట్టి మరీ చిరుని పొగిడేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఇండస్ట్రీ వాళ్లకు చిరంజీవి ఒక్క గ్లాస్ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఒక పూట భోజనం పెట్టలేదు అని తీవ్రంగానే విమర్శించాడు చిన్నికృష్ణ.

అయితే ఇంతలోనే ఆయన నాలుక మడత పెట్టేశారు. పైగా ఇంతకాలానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై పంచ్ వేసే ప్రయత్నం చేస్తూ చిరుని పొగిడేయడం చర్చకొచ్చింది.

ఎందరో ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు.. కానీ మెగాస్టార్ మాత్రం మెగాస్టారే. ఆయన పరిణతి.. ఒదిగి ఉండే స్వభావం వల్ల ఎప్పటికీ గొప్ప వ్యక్తిగా నిలుస్తారు! అంటూ పొగిడేశాడు చిన్నికృష్ణ. కెరీర్ లో జీరో శాతం తప్పులు చేసిన హీరో ఆయన అని అన్నారు. మెగాస్టార్ పై రాళ్లు వేస్తే అవి తిరిగి వెయ్యి రెట్లు వేగంతో వెనక్కి వస్తాయి!! అంటూ తనదైన శైలిలో పోయెటిక్ గానే పొగిడేశాడు చిన్ని కృష్ణ. ఇటీవల ఏపీ సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం.. దానికి చిరు సపోర్ట్ చేయడంతో చిన్ని కృష్ణ ఇలా యూటర్న్ తీసుకుని పొగిడేయడం చర్చకు వచ్చింది.

“చిరంజీవి జనాల వల్ల టాప్ హీరో అయ్యారు. కానీ జనం కోసం ఏదీ చేయలేదు. చిరు తన రాజకీయ పార్టీని అమ్మారు“ అని చిన్నికృష్ణ విమర్శించాడు. అప్పట్లో అన్ని కామెంట్లు చేసిన చిన్ని ఇంతలోనే మారారేమిటో! అంటూ పంచ్ లు వేస్తున్నారు. మరి చిన్నికృష్ణ బిస్కెట్ దేనికో మరి!
Please Read Disclaimer