మెగా 152 మళ్లీ ట్విస్ట్

0

భరత్ అనే నేను చిత్రం విడుదలైన వెంటనే దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేసేందుకు కమిట్ అయ్యాడు. చిరంజీవి 152 చిత్రం అఫిషియల్ అనౌన్స్ వచ్చి చాలా నెలలు అయ్యింది. సంవత్సర కాలంకు పైగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కోసం ఎదురు చూస్తున్నారు. సైరా నరసింహారెడ్డి భారీ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల దాంతో సమాంతరంగా కొరటాల మూవీ వద్దనుకున్నారు. గత నెలలో సైరా విడుదల అవ్వడంతో వెంటనే నవంబర్ లో మెగా 152 పట్టాలెక్కనుంది మెగా కాంపౌండ్ నుండి వార్తలు వచ్చాయి.

మొన్నటి వరకు ఈనెలలోనే చిరంజీవి.. కొరటాలల మూవీ ప్రారంభం అవ్వబోతుందని అంతా అనుకున్నారు. కాని సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను కాస్త ఆలస్యంగా అంటే డిసెంబర్ రెండవ వారంలో మొదలు పెట్టబోతున్నారట. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిపిన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని.. దాంతో పాటు చిరంజీవికి కొన్ని ఇతర కమిట్ మెంట్స్ ఉన్న కారణంగా షూటింగ్ మరోసారి వాయిదా వేశారంటూ సమాచారం అందుతోంది.

ఈ చిత్రంలో త్రిష ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని సెకండ్ హీరోయిన్ పాత్రకు తెలుగమ్మాయి ఈషా రెబ్బను పరిశీలిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా పట్టాలెక్కిన తర్వాత హీరోయిన్స్ మరియు ఇతర నటీనటులు టెక్నీషియన్స్ అందరి వివరాలు అఫిషియల్ గా వచ్చేస్తాయి. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈనెలలో ప్రారంభం అవుతుందనుకుంటే ట్విస్ట్ ఇచ్చి వచ్చే నెలకు షిఫ్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం మెగా ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహ పర్చుతుంది. ఆలస్యంగా ప్రారంభం అయినా కూడా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను వచ్చే ఉగాదికి విడుదల చేసేందుకు చాలా పట్టుదలతో ఉన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer