‘సైరా’ని పక్కన పెట్టేశా..కారణం అదే !

0

మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా నర్సింహ రెడ్డి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. యుద్ధ వీరుడు ఉయ్యాల నర్సింహ రెడ్డి కథతో సినిమా చేయాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న చిరు కోరిక ఎట్టకేలకు తీరింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో అక్టోబర్ 2న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలెట్టేశారు.

అయితే ఈ సినిమా సంగతులను అసలు ఈ సినిమా మొదలయ్యే ముందు జరిగిన విషయాల గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు మెగా స్టార్. ‘శంకర్ దాదా MBBS’ సమయం నుండే ఉయ్యాల వాడ నర్సింహ రెడ్డి కథతో సినిమా చేయలనుకున్నానని కానీ ఆ సమయంలో బడ్జెట్ కారణంగా వెనకడుగు వేశామని తెలిపారు చిరు.

150వ సినిమాగా అదే కథతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని కానీ రీ ఎంట్రీ అలాంటి కథతో కాకుండా కమర్షియల్ అంశాలతో ఓ సందేశాత్మక సినిమా అయితే బెటర్ గా ఉంటుందని భావించి ఖైదీ 150 చేశానని చెప్పాడు. ఆ సినిమాతో వచ్చిన రెస్పాన్స్ బట్టి ఉయ్యాలవాడ కథ చేయాలని డిసైడ్ అయి ఎట్టకేలకు 151 సినిమాగా సైరా చేశానని చెప్పుకున్నాడు మెగాస్టార్. సో ఎట్టకేలకు తన కోరికను తీర్చుకొని ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మరింత కీర్తి పొందాలని చూస్తున్నారు చిరు. ‘సైరా: చిరు కెరీర్ లో మరో మైలు రాయిగా నిలుస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer