దిల్ రాజుకి మెగా లైన్ క్లియర్?

0

టాలీవుడ్ లో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా అగ్ర స్థానంలో కొనసాగుతున్న దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించారు కానీ ఎందరికో డ్రీం ప్రాజెక్ట్స్ గా చెప్పబడే చిరంజీవి పవన్ కళ్యాణ్ లతో మాత్రం సాధ్యపడలేదు. చిరు రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి దిల్ రాజు కెరీర్ పుంజుకునే స్టేజి లో ఉంది. టాప్ ప్లేస్ వెళ్ళాక చిరు సినిమాలు మానేశారు. ఇక పవన్ అందుబాటులోనే ఉన్నా ఏవేవో కారణాల వల్ల అదీ సాధ్యపడలేదు. ఇక ఇప్పుడు జనసేన వచ్చాక ఆ ఛాన్స్ దాదాపు లేనట్టే. అయితే చిరుతో అవకాశం ఇంకా ఉంది

అందుకే దిల్ రాజు ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. సైరా పూర్తి చేసుకుని త్వరలో కొరటాల శివ సినిమాలో జాయిన్ కానున్న చిరు ఆ తర్వాత ఎవరితో చేస్తారనే క్లారిటీ ఇంకా రాలేదు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శీను దర్శకత్వంలో ఓ మూవీ ఉంటుందన్న టాక్ ఉంది స్క్రిప్ట్ లాక్ కావడానికి చాలా టైం పడుతుందట. వీటి సంగతి ఎలా ఉన్నా అవి అయ్యాక కానీ లేదా మధ్యలో కానీ తనకో ప్రాజెక్ట్ ఓకే చేయమని ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకైనా రెడీ అనే సంకేతం ఇస్తూ దిల్ రాజు చిరంజీవికి ఓ ప్రతిపాదన ఉంచారట.

సానుకూలంగా స్పందించిన చిరు తప్పకుండ చేద్దామని కథ దర్శకుడు రెడీ చేసుకుని తీసుకొస్తే ఒకవేళ అది వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తే తనకేమి అభ్యంతరం లేదని చెప్పినట్టు వినికిడి. దీనికి టైం అయితే బాగానే పట్టేలా ఉంది. చిరు ఇమేజ్ కి స్టేచర్ కి తగ్గ కథ రాసే దర్శకుడి కోసం దిల్ రాజు ఇప్పటికే సీరియస్ డిస్కషన్స్ లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ నిజంగా కార్యరూపం దాలిస్తే దిల్ రాజుకు ఇంత కన్నా జాక్ పాట్ ఉంటుందా
Please Read Disclaimer