సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

మెగాస్టార్ చెవిలో బాలయ్య గుసగుస

0

స్వర్గీయ కోడి రామకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు అందించారు. ఇండస్ట్రీ అగ్ర హీరోలు చిరంజీవి – బాలకృష్ణతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన రెండో కుమార్తె కోడి ప్రవల్లిక వివాహ వేడుకలో ఇండస్ట్రీ బెస్ట్ హీరోలు సందడి చేశారు. ఈ సందర్భంగా పెళ్లి వేదిక వద్ద ఒక అరుదైన దృశ్యం కంటపడింది.

ప్రవల్లిక- సి.హెచ్. మహేష్ జంటను ఆశీర్వదించేందుకు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఇదే వేడుకలో చిరు ఆశీనులైన చోటే.. ఆ పక్కనే బాలకృష్ణ కూచుని కనిపించారు. అక్కడితో అయ్యిందా? అంటే .. ఆ తర్వాత సీను చాలానే రక్తి కట్టించింది. మెగాస్టార్ చిరంజీవి .. నటసింహా నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సేపు ఏవో విషయాల్ని ముచ్చటించారు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి తన చెవిని అటు పడేస్తే.. బాలయ్య ఏదో గుసగుసగా చెప్పారు. అదేమిటో అర్థం కాలేదు కానీ.. రాజకీయాలు మాత్రం కాదని అర్థమవుతోంది. ఈ పెళ్లి వేడుకలో బహుశా సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణతో తమ అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుని ఉండొచ్చు.

గత ఏడాది అక్టోబర్ లో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ప్రవళ్లిక నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఇక తాజాగా పెళ్లి వేడుకకు పలువురు సినీ- రాజకీయ ప్రముఖులు విచ్చేసి కొత్త జంటని ఆశీర్వదించారు. టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు.. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. అమ్మోరు-దేవి-దేవీపుత్రుడు-అంజి-అరుంధతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని తెరకెక్కించారు. గ్రాఫిక్స్ ని మేళవించి ఫాంటసీ చిత్రాల్ని తెరకెక్కించడంలో ఆయనకు సాటిరాలేరు ఎవ్వరూ. సౌత్ సహా అన్ని భాషల్లో సుమారు 120 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత కోడి రామకృష్ణ సొంతం.
Please Read Disclaimer