చిరు152: సమ్మర్ టార్గెట్ ఫిక్స్!

0

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. #చిరు152 గా రిఫర్ చేస్తున్న ఈ సినిమా ఈమధ్యనే లాంచ్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్లోనే మొదలుపెడుతున్నారు. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది.

ఈ సినిమాను వచ్చేఏడాది సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. పక్కా స్క్రిప్ట్ రెడీచేసి ఉండడం.. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి షూటింగ్ డిలే ఆయ్యే అవకాశం ఉండదనేది కొరటాల ఆలోచనట. సమ్మర్ సీజన్ అయితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందనేది ఈమధ్య కొన్ని సినిమాల విషయంలో ఋజువయింది.. దీంతో కొరటాల ఈ సీజన్లోనే చిరు సినిమాను బరిలోకి దించాలనే ఆలోచనతో ఉన్నారట.

టాలీవుడ్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పటి వరకూ కొరటాల ఏ స్టార్ హీరోతో పని చేసినా ఆ సమయానికి వారి కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా మలిచాడు. దీంతో మెగాస్టార్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఫార్ములాకు మెగాస్టార్ ఇమేజ్ తోడైతే సినిమా ప్రేక్షకులను మురిపించడం ఖాయమేనని మనం డిసైడ్ అయిపోవచ్చేమో.
Please Read Disclaimer