చిరు – ప్రభాస్ డ్రాప్ అయ్యారే!

0

తెలుగు పండగలలో ‘ఉగాది’ కీలకం. తెలుగు సంవత్సరాది కావడంతో తెలుగు వారందరూ పండుగను బాగా చేసుకుంటారు.అందుకే దసరా తర్వాత ఉగాదిను శుభ పండుగగా భావించి స్టార్ హీరోలు తమ సినిమా ఫస్ట్ లుక్స్ వదులుతుంటారు. అయితే ఈ ఉగాదికి కూడా మెగా స్టార్ తో పాటు ప్రభాస్ కూడా తన అప్ కమింగ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని చూసారు.

కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆ ఆలోచనను విరమించుకున్నారు. నిజానికి ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ ఆన్ ది వే అంటూ మేకర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఇక చిరు అండ్ టీం కూడా ఒకరోజు ముందు ఫస్ట్ లుక్ అంటూ హడావుడి చేయాలని భావించారు. కానీ అటు చిరు ఇటు ప్రభాస్ ఇద్దరూ డ్రాప్ అయ్యారు.

ఇక అనుకున్న ఫస్ట్ లుక్స్ రాలేదు కానీ ఊహించని ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోస్టర్ రిలీజై తెలుగు ప్రేక్షకుల్లో జోష్ నింపింది. అసలు సినిమాకు ఏ టైటిల్ పెడతారన్న ప్రశ్నకు సమాదానం ఇచ్చి మోషన్ పోస్టర్ వదిలాడు జక్కన్న. సో చిరు ప్రభాస్ డ్రాప్ అయినప్పటికే ఎన్టీఆర్ తారక్ మాత్రం ఈ ఉగాదికి బాగానే సందడి చేసారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-