నన్ను తిట్టావ్, నీకు మనసెలా వచ్చింది: మహేష్ సాక్షిగా ‘మెగా’ రివేంజ్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో నవ్వుల పూవులు పూయించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో మెగాస్టార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. ఆయన స్పీచ్‌లో వాళ్ల రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తూనే అప్పట్లో విజయశాంతి తనను తిట్టిన విషయాన్ని గుర్తు చేసి ఫన్నీగా మెగా రివేంజ్ తీర్చుకున్నారు మెగాస్టార్.

‘‘ఈరోజు సండే.. నాతో ఆరోజు ‘సండే అననురా.. మండే అననురా ఎన్నడు నీదాన్నిరా’ అని అప్పట్లో నాకు మాట ఇచ్చి నా మనిషి నా బ్లాక్ బస్టర్స్ హిట్ పెయిర్ విజయశాంతి. మేం ఇద్దరం ఎలా ఉండేవాళ్లం అంటే హీరో హీరోయిన్లులా కాదండీ.. టీ నగర్‌లో మా ఇంటి ఎదురుగానే ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే.. మా ఇంటికి తను వచ్చేది తన ఇంటికి నేను వెళ్లేవాడిని. ఇక సినిమాల పరంగా 19-20 సినిమాలు కలిసి చేశాం. ఎంత హుషారుగా ఎంత సరదాగా చేసే వాళ్లం అంటే.. మళ్లీ మళ్లీ చేయాలనిపించేది.

Read Also: ఆ కంప్లైంట్‌ నాపై ఉంది కాని.. నేను కథ నచ్చితేనే చేస్తా: మహేష్ బాబు

అయితే విజయశాంతి నీ మీద నాకు చిన్న కోపం ఉందని చిరంజీవి అనగా.. ఎందుకు అని విజయశాంతి చిరంజీవి పక్కకు వచ్చి అడిగారు. ‘నాకంటే ముందు నువ్ పాలిటిక్స్‌కి వెళ్లావ్ కదా.. అప్పట్లో నన్ను అన్ని మాటలు అన్నావ్.. నీకు ఎలా మనసు వచ్చింది’ అని చిరంజీవి అనగడంతో స్టేజ్ అంతా నవ్వులతో నిండిపోయింది.

వెంటనే విజయశాంతి చిరంజీవి చేతిలో నుండి మైక్ లాక్కుని ‘పంచ్ డైలాగ్ వేశారు.. ఈయన చేయి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో రఫ్ ఆడిస్తా.. రాజకీయం వేరే సినిమా వేరు.. మీరు నా హీరో.. నేను మీ హీరోయిన్ ఇద్దరం కలిసి 20పైగా సినిమాలు చేశాం. మళ్లీ ఇప్పుడు కూడా చేద్దామా.. ఆయన్ని అలా చూసి ఇరవై ఏళ్లు అయ్యింది. మీరు నన్ను ఎలా మరిచిపోతారు’ అంటూ మెగాస్టార్‌తో కలిసి ఫుల్ ఫన్ నింపారు.
Please Read Disclaimer