సీనియర్ హీరోల ఆశలన్నీ వారిమీదే

0

ప్రస్తుతం చిరు – నాగ్ – బాలయ్య – వెంకీ ఇలా నలుగురు హీరోలు తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. చిరు వెంకీ లు మార్కెట్ ఇంకా పెంచుకొనే పనిలో ఉంటే బాలయ్య నాగ్ ఎలాగైనా ఓ హిట్ కొట్టి మళ్ళీ సత్తా చాటాలనే ఆలోచనతో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రాంచైజీ తో తనకున్న కొద్దిపాటి మార్కెట్ ను ఘోరంగా దెబ్బ తీసుకున్నాడు బాలయ్య. లేటెస్ట్ గా వచ్చిన ‘రూలర్’ బాలయ్య మార్కెట్ ని అమాంతం పడేసింది.

అందుకే ఇప్పుడు బాలయ్య బోయపాటి సినిమా మీదే ఆశలు పెట్టుకొని ఎలాగైనా మళ్ళీ ఓ బ్లాక్ బస్టర్ కొట్టి మార్కెట్ ను దక్కించుకోవాలని చూస్తున్నాడు. అందుకే డౌన్ లా ఉన్న తనకి హిట్ ఇచ్చే బోయపాటికె ఛాన్స్ ఇచ్చి సినిమా చేస్తున్నాడు నందమూరి హీరో. ఈ సినిమా ఇదే ఏడాదిలో రాబోతుంది. అన్నీ కుదిరితే దసరాకి రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ జరుగుతుంది.

ఇక నాగ్ పరిస్థితి కూడా అంతే. ‘మన్మథుడు 2’ సినిమాతో మార్కెట్ ని డౌన్ చేసుకున్నాడు. అందుకే రైటర్ సోలొమాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ క్రైం కాప్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ మీదే నమ్మకం పెట్టుకొని ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తునాడు. మరి బాలయ్య నాగ్ నమ్మకాన్ని ఈ దర్శకులు నిలబెట్టుకుంటారో లేదో ?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-