నిఖిల్ పై చిరు ఊహించని కామెంట్

0

నిఖిల్ కథానాయకుడి గా నటించిన అర్జున్ సురవరం ఈనెల 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తన ఫేవరెట్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి తనని తమ్ముడు అని ప్రస్థావిస్తూ ఆశీర్వదించడంతో నిఖిల్ ఎంతో ఎమోషన్ అయ్యాడు.

అయితే ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి ఎంతో జోవియల్ గా మాట్లాడేస్తూ నిఖిల్ పై చేసిన ఓ కామెంట్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. “నేను ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి.. ఇప్పటి వరకు ఎగ్జయిట్ మెంట్ లో ఏదేదో(చిరు గురించి) మాట్లాడేశాడు“ అంటూ నిఖిల్ గురించి చిరంజీవి అంటుండగానే.. ఆయన చెవిలో నిఖిల్ ఏదో గుసగుసగా మాట్లాడడం వేదిక పై కనిపించింది. దీంతో చిరంజీవి నవ్వుతూ.. “చూశారా! కంగారు.. నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెబుతున్నాడు. ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే అనుమానిస్తున్నాడు“ అనేశారు. వయసు మీద పడి పేరు మర్చిపోతానని అనుకున్నాడేమో.. తను జస్ట్ నిఖిల్ అని పేరును చెవిలో గుసగుసగా చెప్పాడు. కానీ పూర్తి పేరు నిఖిల్ సిద్ధార్థ అని నాకు బాగా గుర్తు.. అని మెగాస్టార్ ఎంతో జోవియల్ గా మాట్లాడేసారు. నిఖిల్ తనకు మరో తమ్ముడు అని శిష్యుడు అని చిరు అన్నారు.

ఈ వేదికపై మెగాస్టార్ ప్రశంసా పూర్వకమైన మాటలకు నిఖిల్ ఎంతో ఎమోషన్ అయ్యారు. నిఖిల్ కళ్ళలో ఆనంద భాష్పాలు కనిపించాయి. మెగాస్టార్ చిరంజీవి తన గురించి మాట్లాడేటప్పుడు నిఖిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తనని అభిమానించే ప్రతి ఒక్కరినీ తమ్ముడు అని సంభోధించడం మెగాస్టార్ అలవాటు. నిఖిల్ సిద్ధార్థ్ తొలి నుంచి మెగాస్టార్ చిరంజీవి కి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer