గిన్నీస్ రికార్డు సాధించిన వీణాపాణికి చిరు సన్మానం

0

తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్వీబాలసుబ్రమణ్యం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మిథునం’ చిత్రంకు సంగీతంను అందించిన వీణాపాణికి ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లండన్ లోని భవన్స్ ఆడిటోరియంలో భారీ సంగీత వేడుకను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రముఖ 72 మ్యూజిక్ ఇన్సుమెంట్స్ ప్లేయర్స్ కంటిన్యూగా 61 గంటల 20 నిమిషాల పాటు తమ సంగీత వాయిద్యాలతో అలరించారు.

అత్యధిక సమయం కంటిన్యూగా మ్యూజిక్ ప్లే చేసినందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుగా నమోదు అయ్యింది. వీణాపాణికి కూడా ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. గిన్సీస్ రికార్డు దక్కించుకున్న వీణాపాణిని మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు.

వీణాపాణి గారికి గిన్నీస్ రికార్డు దక్కడం తెలుగు వారికే కాకుండా మొత్తం ఇండియాకే గర్వకారణం అంటూ అభినందించాడు. కళను నమ్ముకున్న వారికి ఇలాంటి అవార్డులు.. రికార్డులు కొలమానాలు అని ఇలాంటివి వారికి బూస్ట్ అన్నాడు. చిరు సత్కారం అందుకున్నందుకు గాను వీణాపాణి చాలా సంతోషం వ్యక్తం చేశారు.
Please Read Disclaimer