ట్విట్టర్ ద్వారా చిరు పలికిన మొదటి పలుకు…

0

మెగాస్టార్ సోషల్ మీడియాలోకి రాబోతున్నట్లు చిరంజీవే స్వయంగా ప్రకటించడంతో అభిమానులందరూ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మెగా అభిమానులు ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈ పవిత్రమైన ఉగాది పండుగ పర్వదినాన చిరు ట్విట్టర్ లో చేరారు. ఈ రోజు ఉదయం చిరు ట్విట్టర్లో తన మొదటి పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ ద్వారా అభిమానులను ఉద్దేశించి తన ప్రేమను తెలిపిన చిరు కరోనాను కలిసి కట్టుగా జయిద్దామని తెలిపారు. ఇక మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ ట్విట్టర్ ఎకౌంట్ ను విస్తృతంగా ఫాలో అవుతున్నారు.

మెగాస్టార్ ట్విట్టర్ ఐడీ @KChiruTweets అకౌంట్ ద్వారా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. “నాతోటి భారతీయులందరితో తెలుగు ప్రజలతో నాకు అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఇలా మాట్లాడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మరిని కలసి కట్టుగా జయించడాయికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం” అంటూ ట్వీట్ చేసాడు. అయితే అందరూ ఊహించినట్లుగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం రిలీజ్ కాలేదు.

ఇదిలావుండగా ఇప్పటికే మెగాస్టార్ అధికారికంగా ఇన్ స్టాగ్రామ్ లో చేరారు. మెగాస్టార్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటివరకూ 4 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. జాయిన్ అయిన తక్కువ సమయంలోనే చాలా విస్తృతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. తన అభిప్రాయాలను భావాలను ఫ్యాన్స్ తో పంచుకోవటానికి చిరు సోషల్ మీడియాలోకి వస్తోన్నందుకు ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-