తన భార్య వల్లే చిరు బిగ్ బాస్ చూసేవారట !

0

స్పీచ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ . కొందరు హీరోలు పైకి కామ్ గా కనిపిస్తూనే మనసులో అనిపించింది చెప్పేస్తూ సిల్లీగా సెటైర్ విసురుతారు. అందులో మహేష్ ప్రథముడు. మహేష్ మాటల్లో ఒక్కో సారి చాలా చిలిపి తనం కూడిన సెటైర్స్ వినిపిస్తాయి.

ఇక ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే కోవలోకి చేరారు. ఇటీవలే ‘సైరా’ సక్సెస్ మీట్ లో చరణ్ కి తను ఎంతో కొంత డబ్బు ఇస్తారనే నమ్మకం తనకి ఉందంటూ దిల్ రాజు పై సరదాగా సెటైర్ వేశారు. చిరు అన్న ఆ మాటలో చాలా అర్థం ఉంది. అది కొందరికి మాత్రమే రీచ్ అయింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు బిగ్ బాస్ లో కొందరు కంటెస్టెంట్స్ పై సరదాగా సెటైర్లు వేశారు.

ముఖ్యంగా టీవీ9 ఇంటర్వ్యూవర్ జాఫర్ ను మాట్లాడనివ్వకుండా సెటైర్స్ వేశారు మెగాస్టార్. జాఫర్ మైక్ పట్టి మాట్లాడే లోపే తను షో నుండి వెళ్లిపోతానని లేదంటే జాఫర్ ఏదొఒక కాంట్రవర్సీలో తనను ఇరికిస్తాడని అన్నాడు. అక్కడితో ఆపకుండా ఎంతో మందిని తన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కాబట్టే తను ఇలా జైలు లాంటి బిగ్ బాస్ హౌజ్ లో ఖైదీగా ఉండాల్సి వచ్చిందని అన్నాడు. ఇక మెగా పంచ్ లకు జాఫర్ ఏం మాట్లాడాలో అర్థం కాక ఏమి మాట్లాడకుండానే కూర్చుండిపోయాడు. పాపం తన పంచ్ లతో జాఫర్ ను మాట్లాడనివ్వకుండా నోరు కట్టేశారు మెగాస్టార్. ఇక తన భార్య వల్లే అప్పుడప్పుడు బిగ్ బాస్ షోను చూసేవాడినని ఈ సందర్భంగా తెలిపారు చిరు. అలా కొన్ని సార్లు షో చూస్తూ అందరినీ గమించేవాడినన్నారు.
Please Read Disclaimer