మెగాస్టార్ కి కూతురు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇదే

0

మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓ వీడియోను రిలీజ్ చేసి అందరికీ ఆహ్లాదాన్ని పంచింది. అందరిలా కాకుండా తండ్రికి సేవ చేస్తూ అందులోనే తనకు సంతోషం ఉందని వినూత్నంగా చెప్పింది.

ఫాదర్స్ డే సందర్భంగా సినీ సెలెబ్రెటీలంతా తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ చిన్నప్పటి ఫొటోలు షేర్ చేస్తుంటే మెగా డాటర్ సుస్మిత మాత్రం తండ్రి చిరంజీవి కోసం హెయిర్ స్టైలిష్ట్ గా మారారు. లాక్ డౌన్ లో బయటకు వెళ్లలేని కారణంగా.. కంటింగ్ తోనూ కరోనా వ్యాపిస్తుంది కాబట్టి కూతురే తండ్రికి కటింగ్ చేసేసింది. ఇదే తన లాక్ డౌన్ యాక్టివిటీస్ అంటూ పేర్కొంది.

ఈ సందర్భంగా ఫాదర్స్ డే విషెస్ చెబుతూ సుష్మిత ఎమోషనల్ గా పోస్టు పెట్టింది. ‘నువ్వు చూపించే ప్రేమకు థాంక్యూ డాడ్. హెయిర్ కట్ చేసే చిన్న విషయం నుంచి నా జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాల్లోనూ నన్ను నమ్మావ్.. అవే ఈరోజు నన్ను కాన్ఫిడెంట్ ఉన్న మనిషిలా తయారు చేశాయ్. అదే తండ్రి అంటే.. వారు మా సాధికారికత కోసం ఏదైనా చేస్తారు. లవ్యూ హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ చిరంజీవిపై ప్రేమను పోస్టు రూపంలో కూతురు సుష్మిత వెల్లడించింది.
Please Read Disclaimer