పవన్ రీఎంట్రీ.. చిరు ఇన్వాల్వ్ మెంట్!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ గురించి చాలారోజుల నుండి కథనాలు వస్తున్నాయి. పలువురు టాప్ ప్రొడ్యూసర్ల దగ్గర ఎడ్వాన్స్ తీసుకున్న పవన్ వారికి తిరిగి ఇవ్వకపోవడంతో పవన్ తప్పనిసరిగా సినిమాలు చేస్తారనే ఒక వాదన వినిపిస్తోంది. ఆ వాదనకు బలం చేకూర్చే విధంగా సదరు ప్రొడ్యూసర్లు కూడా తమ వైపు నుండి పవన్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ ఈమధ్య పవన్ కోసం ఒక కథ తయారు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం క్రిష్ ఆ కథను మెగాస్టార్ చిరంజీవికి వినిపించారని సమాచారం. నిజానికి పవన్ తన కథలను తనే వింటారు.. తన నిర్ణయమే ఫైనల్. కానీ ఈసారి మాత్రం పవన్ స్క్రిప్ట్ ను చిరంజీవి విన్నారట. క్రిష్ చెప్పిన కథ చిరంజీవిని ఫుల్ గా ఇంప్రెస్ చేసిందని.. చిరు ఇప్పటికే క్రిష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తారు కాబట్టి పవన్ కోసం చిరు కథను ఫైనలైజ్ చేశారా లేదా పవన్ రీఎంట్రీ కోసం చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది.

పవన్ స్వయంగా తన రీఎంట్రీ గురించి ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా బ్యాకెండ్ లో మాత్రం పవన్ సినిమా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా పవన్ సినిమాకు సంబంధించిన వార్తలు అభిమానులకు సంతోషాన్నిస్తున్నాయి.
Please Read Disclaimer