మనవరాలి బర్త్ డేలో మెగా ఆనందం

0

మెగాస్టార్ రెండో కుమార్తె శ్రీజ- కళ్యాణ్ దేవ్ దంపతుల వారసురాలు నవిష్క తొలి బర్త్ డే గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. బేబి నవిష్క సంథింగ్ స్పెషల్ గా క్రిస్మస్ బర్త్ డే జరుపుకోవడం ఆసక్తికరం. క్రిస్మస్ డే ప్లస్ బర్త్ డే ట్రీట్ అదిరిపోయింది. డిసెంబర్ 25 సాయంత్రం నవిష్క బర్త్ డే సందర్భంగా క్రిస్మస్ వేడుకల్ని అంతే జాయ్ ఫుల్ గా మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో బర్త్ డే బేబి నవిష్క ఎంతో చీర్ ఫుల్ గా కనిపించింది.

ఇక మేనకోడలు బర్త్ డే పార్టీని రామ్ చరణ్ స్వయంగా దగ్గరుండి ఘనంగా జరిపించారు. చరణ్- ఉపాసన దంపతులు ప్రత్యేకించి కళ్యాణ్ దేవ్- శ్రీజ దంపతులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలోకి రిలీజయ్యాయి. ఈ వేడుకల్లో బర్త్ డే కేక్ ని దగ్గరుండి కట్ చేయించడమే గాక.. శాంటాగా మారి గిఫ్ట్స్ అందించారు.

ఇక మనవరాలు బర్త్ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఆనందోత్సాహానికి సంబంధించిన ఫోటో తాజాగా రిలీజైంది. ఈ ఫోటోలో మనవరాలిని ఎత్తుకుని చిరు ఎంతో తన్మయంలో సంతోషంగా కనిపించారు. ఈ ఫోటోని చిరు పెద్ద కుమార్తె సుశ్మిత కొణిదెల స్వయంగా అభిమానులకు షేర్ చేశారు. లిటిల్ పపాయకు బర్త్ డే శుభాకాంక్షలు.. తను మా అందరికీ శాంటా ఇచ్చిన లిటిల్ గిఫ్ట్.. అంటూ వ్యాఖ్యను జోడించారు.
Please Read Disclaimer