బన్నీ పార్టీ .. ఎగ్గొట్టారట!

0

ఇండస్ట్రీ హిట్ కొట్టి సినిమా జనాలకు ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వాలన్నది బన్నీ డ్రీం. ఆల్మోస్ట్ అన్నీ ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డు అందుకోవడంతో ‘అల వైకుంఠ పురములో’ సక్సెస్ ను ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులతో షేర్ చేసుకున్నారు. నిన్న గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీకి ఆల్మోస్ట్ అందరినీ ఇన్ వైట్ చేసారు. బన్నీ రంగంలోకి దిగి మరీ చాలా మంది హీరోలకి డైరెక్టర్స్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి పార్టీకి పిలిచాడు.

ఆదివారం సందర్భంగా నిన్న ఈ పార్టీ ఏర్పాటు చేసారు అల్లు ఫ్యామిలీ. అయితే పిలిచిన వ్యక్తుల్లో సగం మంది కూడా ఈ పార్టీ కి హాజరు కాలేదని ఇన్ సైడ్ టాక్. గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసిన – చేయబోతున్న డైరెక్టర్స్ తో పాటు బన్నీ కి క్లోజ్ ఉండే కొంత మంది హీరోలు మాత్రమే పార్టీకి వెళ్లారట. అయితే బన్నీ మాత్రం ఈ పార్టీలో జోష్ పుల్ గా ఎంజాయ్ చేసాడని అంటున్నారు. అందరితో కలిసి తన మనసులో ఉన్న ఆనందాన్ని పంచుకుంటూ నవ్వులు కురిపించాడట.

నిజానికి మన ఇండస్ట్రీలో ఓ సినిమా భారీ కలెక్షన్స్ అందుకోవడం అందరూ ఆనందించాల్సిన విషయమే. అదీ నాన్ ‘బాహుబలి’ రికార్డు కొట్టడం అంటే ఇంకా సంతోష పడి తెలుగు సినిమా స్టామినా ఇదంటూ చెప్పుకోవాలి. కానీ ఇండస్ట్రీలో అలాంటిదేమీ జరగలేదు. బన్నీను ‘అల వైకుంఠపురములో’ టీంను పిలిచి మెచ్చుకునే వారే కరువైయ్యారు. చిన్న సినిమా అయినా సక్సెస్ అయితే ఇంటికి పిలిచి అభినందించే మెగాస్టార్ సైతం ఎందుకో ‘అల’ సక్సెస్ ను లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే నేమో ఈ సినిమా ఫంక్షన్స్ లో ఎక్కడా ఆయన కనిపించలేదు. మొన్న జరిగిన ఫంక్షన్ లో కూడా బన్నీ – త్రివిక్రమ్ – నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్స్ కి షీల్డులు ఇచ్చుకున్నారు. ఇక చిరు మావయ్య ఈ సినిమా ఇంత సక్సెస్ అవుద్దని ముందే ఊహించారని బన్నీ చెప్పినా రిలీజ్ తర్వాత ఆయన ఈ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉంది. మరి మరో వైపు మహేష్ సినిమా కూడా ఆల్మోస్ట్ భారీ కలెక్షన్స్ రావడం వల్ల ఇండస్ట్రీ కూడా అల సక్సెస్ ను లైట్ తీసుకుందేమో.
Please Read Disclaimer