ఆ లోగో ఎక్కడంటూ ప్రశ్నించిన చిరు

0

మా అసోసియేషన్ కి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. కొన్నేళ్లుగా కొందరు నటులు ప్రెసిడెంట్ గా చేస్తూ కొనసాగిస్తున్న ఈ అసోసియేషన్ లో ప్రస్తుతం కొంత రచ్చ జరుగుతుంది. లేటెస్ట్ గా జరిగిన ‘మా’ ఎన్నికల్లో కొన్ని గొడవలతో గందరగోళం జరిగింది. ఇక ఎన్నికలు అయ్యాక కూడా నరేష్ – జీవిత రాజశేఖర్ మధ్య కూడా కొన్ని వివాదాలు నడిచాయి. ఇక ఈ అసోసియేషన్ గొడవల గురించి ఇంత వరకూ మాట్లాడని మెగా స్టార్ చిరంజీవి లేటెస్ట్ గా మా డైరీ లాంచ్ లో తన మనసులోని మాటలను బయటపెట్టారు.

‘మా’ లో ఎన్ని ఇబ్బందులు గొడవలు ఉన్నా అవి బయటికి వెళ్ళకుండా పరిష్కరించుకోవాలని అన్నారు. ఒక్క మాటలో మంచి మైక్ లోనూ చెడును చెవిలో చెప్పుకోవాలని ఇరువురికి చెప్పాడు చిరు. అయితే మేము ప్రారంభించిన మా కి సంబంధించి కొన్ని నెలలుగా జరుగుతున్నవన్నీ తన దృష్టికి వచ్చాయని తెలిపాడు. ఇక కన్నడ ఇండస్ట్రీ లాగే తము ఒకటిగా ఉంది ముందుకు వెళ్లి మా అసోసియేషన్ కి ఓ భవనం నిర్మించుకోవాలని ఈ విషయంలో ప్రభుత్వం సహాయం అందివ్వడానికి సిద్దంగా ఉందని అంతే కానీ నేను ముందు వెళ్తా అంటూ ఒకరినొకరు తోసుకోవద్దని అందరం కలిసే గేటు దాటాలని చూడాలని కోరాడు. ఇక కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయని తన మధ్య సురేఖ మధ్య గొడవలు జరుగుతాయని ఆమెతో ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఆదర్శ దంపతుల్లా కనిపించినా చివరికి తమ మధ్య కూడా గొడవలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసాడు.

ఇక అసోసియేషన్ ప్రారంభంలో స్వర్గీయ బాపు గారితో ఒక లోగో గీయించమని అది ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడం భాద కలిగించదని కళామతల్లి ఒడిలో ఉన్నట్టుగా ఉండే ఆ లోగోతోనే వచ్చే ఏడాది డైరీ వేయించాలని ఆశించారు. ఇక వెంటనే నరేష్ ఏదో చూపిస్తుండగా ఇంత బుజ్జిగా నాకొద్దు అంటూ మైక్ లోనే చెప్పేసాడు చిరు. ఫైనల్ గా అందరం కలిసి విభేదాలు లేకుండా ఒక్కటిగా ముందుకు వెళ్లి అసోసియేషన్ ను టాప్ లో ఉంచాలని మెగా స్టార్ మెగా ఆదేశం.
Please Read Disclaimer