తమ్ముడు డ్రాప్ అన్నయ్య రంగంలోకి

0

జార్జ్ రెడ్డి అనే సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. సందీప్ మాధవ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలంగాణా పవర్ ఫుల్ లీడర్ జార్జ్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కింది. అయితే అప్పట్లో ఈ కథతో పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని చూసాడు కానీ కుదరలేదు. ఫైనల్ గా యంగ్ టీం ఆ కథతో సినిమా తీసేసి రిలీజ్ కి రెడీ చేసేసారు.

అయితే తను చేయలేకపోయిన ఈ సినిమా ట్రైలర్ చూసి ఓ ఈవెంట్ ఏర్పాటు చేసుకోమని తను గెస్ట్ వచ్చి మాట్లాడతానని టీం కి చెప్పాడు పవన్. ఇక ఏర్పాట్లు జరిగే క్రమంలో పర్మిషన్ దొరకకపోవడంతో ఈవెంట్ క్యాన్సల్ అయింది. ఇక పవన్ వాయిస్ తో ఈ సినిమాకు మరింత బజ్ వస్తుందని ఆశించిన టీంకు నిరాశే మిగిలింది.

ఇక తమ్ముడు ప్రమోట్ చేయలేకపోయిన సినిమాను ఇప్పుడు అన్నయ్య రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా టీంను ఇంటికి పిలుచుకొని ఓ సాంగ్ రిలీజ్ చేసిన మెగా స్టార్ సినిమా గురించి జార్జ్ రెడ్డి గురించి మాట్లాడి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో పవన్ రాకపోయినా మెగా స్టార్ ప్రమోషన్ తో సినిమాపై మరింత బజ్ వచ్చింది. మరి ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని సూపర్ హిట్టయితే టీం చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టే.
Please Read Disclaimer