మెగాస్టార్ చిరంజీవి రేంజ్ వేరప్పా సిద్ధప్పా!

0

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ హీరోగా తెలుగు తెరను ఏలిన అయన కొంతకాలం రాజకీయాలలో ఉన్న కారణంగా నటనకు దూరంగా ఉన్నారు. అయితే దాదాపు పదేళ్ళ గ్యాప్ తర్వాత ‘ఖైది నెం. 150’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్.. సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే ఈమధ్య కొందరు చిరు ఇప్పుడు అరవైల వయసులో ఉన్నారని.. హీరో పాత్రలు మానేసి అతిథి పాత్రలు ఎంచుకుంటే బాగుంటుందని.. కుర్రహీరోలు చేసే కమర్షియల్ సినిమాలు ఎందుకని విమర్శిస్తున్నారు. అయితే వారికి మెగా ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. చిరంజీవికి రీ ఎంట్రీ సినిమా ‘ఖైది నెం. 150’ బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమా అని గుర్తు చేస్తున్నారు. ఈ తరం స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్స్ సాధించే సత్తా చిరుకు ఉందని అంటున్నారు. అంతే కాదు.. చిరు లాస్ట్ సినిమా ‘సైరా’ కూడా భారీ కలెక్షన్స్ సాధించిన విషయం గుర్తు చేస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ కూడా ఇప్పటికీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉన్నారని.. వరస ఫ్లాపులు పలకరిస్తున్నా ఆయన సినిమాలు చేయడం ఆపలేదు కదా.. మరి విజయాలు సాధిస్తున్న చిరు ఎందుకు సినిమాలు చేయడం ఆపాలి.. అని ప్రశ్నిస్తున్నారు. మిగతా సీనియర్ స్టార్లు వేరు.. చిరంజీవి వేరు అని.. చిరు ఇప్పటికీ ఈ తరం స్టార్ హీరోలకు దీటుగా కలెక్షన్స్ సాధించగలరని అంటున్నారు. చిరు ఇలాగే నటించాలని.. మరెన్నో విజయాలు సాధించాలని మెగా ఫ్యాన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-