డ్యుయల్ రోల్ పై స్పందించిన మెగాస్టార్

0

ప్రస్తుతం సైరా షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు మెగాస్టార్. నెక్స్ట్ కొరటాలతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కంప్లీట్ లుక్ చేంజ్ చేసి ఇంకాస్త యంగ్ గా కనిపించబోతున్నాడు చిరు. ‘భరత్ అనే నేను’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ పూర్తి చేసి పనిలో ఉన్నాడు. కథ పూర్తవగానే ప్రీ ప్రోడక్షన్ వర్క్ మొదలు కానుంది.

అయితే ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చెస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తపై లేటెస్ట్ గా స్పందించాడు చిరు. కొరటాలతో చేస్తున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. సినిమాకు దాదాపు టెక్నీషియన్స్ అందరూ ఖరారయ్యాయి.ఇంకా నటీ నటుల ఎంపిక చేయాల్సి ఉంది. ఇక సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నానని వచ్చిన వార్తలో నిజం లేదు అని తెలిపాడు మెగాస్టార్.

సో కొరటాల తను చేసిన సినిమాల్లో ఇప్పటి వరకూ ఆ హీరో ను రెండు పాత్రల్లో చూపించడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకోని మెగా స్టార్ ని రెండు పాత్రల్లో ఎలాంటి కథతో చూపిస్తాడో అని ఎదురుచూస్తున్న వారికి క్లారిటీ ఇచ్చేసాడు మెగాస్టార్. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది కథలో కావాల్సినంత మాస్ అంశాలు కూడా జోడిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తెలియనున్నాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home