‘సైరా’ ఫస్ట్ డే కలెక్షన్స్: మీసం మెలేస్తున్న మెగాస్టార్

0

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. తొలి స్వాతంత్ర్యపోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను తీర్చాడు మెగా ప్రొడ్యుసర్ రామ్ చరణ్ తేజ్. సుమారు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది.

బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి విడుదలైన ప్యాన్ ఇండియా చిత్ర రిజల్ట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. అయితే సినిమా ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు.

ఇక ‘సైరా’ అన్ని థియేటర్స్‌లో ఆట మొదలైంది.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టాడు. అధికారికంగా లెక్కలు రావాల్సి ఉండగా.. సైరా తొలిరోజు దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల భారీ బిజినెస్ చేసిన సైరాకు పాజిటివ్ టాక్ రావడంతో.. లాభాల బాట పట్టడానికి ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ టైం పట్టదని అంచనా వేస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ఏరియాల వారీగా చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాం రూ. 30 కోట్లు, సీడెడ్ రూ. 20 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 15 కోట్లు, ఈస్ట్ రూ. 10 కోట్లు, వెస్ట్ రూ. 10 కోట్లు, క్రిష్ణా 8. 5 కోట్లు, గుంటూరు-నెల్లూరు కలిపి రూ. 16 కోట్లు‌ మార్కెట్ జరిగింది. అయితే ఓవర్సీస్‌లో కూడా తొలిరోజు దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన వరల్డ్ వైడ్ తొలిరోజు రూ. 60 కోట్ల షేర్‌తో భారీ కలెక్షన్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా తొలిరోజు అన్ని షోలు పూర్తి కాకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. రేపటికి అధికారంగా తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.




Please Read Disclaimer