ఇది మెగా సైరా కష్టం – పిక్ టాక్

0

మనీ సినిమాలో ఓ పాటలో చెప్పినట్టు ఊరికే ఎవరూ మెగాస్టార్లు అయిపోరు. దాని వెనుక ఎంతో కష్టం ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఒక స్థాయికి చేరుకున్నాక కోరుకున్న లక్ష్యం పూర్తయ్యాక ఏ మనిషైనా రిలాక్స్ అవ్వొచ్చు. అలా చేస్తే మెగాస్టార్ కు మాములు వ్యక్తికి తేడా ఏముంటుంది. అందుకే చిరు 64 ఏళ్ళ వయసులోనూ చాలా క్లిష్టమైన సైరా నరసింహారెడ్డి పాత్రను ఎంచుకోవడం ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదో కమర్షియల్ సినిమాల్లో నటించి నాలుగు రాళ్లు వెనకేసుకోకుండా ఇంత సాహసంతో కూడిన రోల్ ని ఛాలెంజ్ గా తీసుకోవడం ఒక్క చిరంజీవికే చెల్లింది.

ఇప్పటికే టీజర్ లోని విజువల్స్ చూసి మెగాఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. నిమిషంన్నరకే ఇన్ని గూస్ బంప్స్ ఉంటే రేపు తెరపై సినిమా చూసేటప్పుడు ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమనిపిస్తోంది. తాజాగా చిరు సైరా టైంలో బాడీ ఫిట్ నెస్ కోసం ట్రైనర్ దగ్గర తీసుకుంటున్న కఠినమైన శిక్షణ తాలూకు పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేలపై తలగడ లాంటి ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా చాలా రిస్కీగా అనిపించే మోకాళ్ళతోనే కసరత్తు చేయించుకున్న స్టిల్ చూస్తే ఎవరికైనా వామ్మో అనిపించక మానదు.

ఇంత వయసులోనూ ఇలాంటివి చేయడం చూస్తే కొంచెం భయం వేయక కూడా మానదు. సైరా పూర్తి కావడం ఆలస్యం తక్కువ టైంలోనే తన లుక్ లో పూర్తి మేకోవర్ చేసుకున్న చిరు జోరు చూస్తూనే ఇంకో పాతిక తక్కువ కాకుండా చరణ్ తో పోటీ పడుతూ సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కోసం రెడీ అవుతున్న చిరు దాని తర్వాత మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టినట్టు సమాచారం.
Please Read Disclaimer