‘జార్జిరెడ్డి’ కోసం మెగాస్టార్ ఓ చేయి వేశాడు

0

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా జార్జిరెడ్డి గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు అయిన జార్జిరెడ్డి గురించి ఏవో కారణాల వల్ల చాలా మందికి తెలియకుండానే పోయింది. పాతికేళ వయసులోనే రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్న జార్జిరెడ్డి కనీసం 30 ఏళ్లు కూడా జీవించి లేడు. చదువులో రెండు గోల్డ్ మెడల్స్ ను పొందిన జార్జిరెడ్డి విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. అలాంటి జార్జిరెడ్డి గురించి సినిమా అంటూ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది.

ఇదే సమయంలో నాగబాబు మీడియా ముందుకు వచ్చి జార్జిరెడ్డిపై ప్రశంసలు కురిపించడంతో పాటు జార్జిరెడ్డి సినిమా చాలా బాగుండబోతుందంటూ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ పేరును కూడా నాగబాబు జార్జిరెడ్డి గురించి మాట్లాడిన సమయంలో తీసుకు రావడంతో సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ గెస్ట్ గా హాజరు అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ప్రీ రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతించక పోవడంతో క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా జార్జిరెడ్డి ప్రమోషన్ లో ఇన్వాల్వ్ అయ్యాడు.

జార్జిరెడ్డి సినిమాలోని అడుగు అడుగు అనే పాటను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్బంగా సినిమా ట్రైలర్ ను మరియు వీడియోలను చిరంజీవికి యూనిట్ సభ్యులు చూపించారు. సినిమా యూనిట్ సభ్యులకు చిరంజీవి ఆశీర్వాదం దక్కింది. జార్జిరెడ్డిపై అభిమానంతో చిరంజీవి పాట విడుదలకు ఒప్పుకుని ఉంటాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కగా మరో వైపు వివాదంతో ఏబీవీపీ నాయకులు ఈ సినిమాను మీడియా ముందుకు లాగారు. సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ వ్యాఖ్యలు చేసి సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగేలా చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer