సైరా ఖచ్చితంగా వస్తుందా రాదా?

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సైరా ఖచ్చితంగా అక్టోబర్ 2న వస్తుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 22 చిరు పుట్టిన రోజు సందర్భంగా అన్ని అనౌన్స్ మెంట్స్ వస్తాయని వేచి చూస్తున్నారు. నిజంగా ఆ డేట్ కి సైరా వస్తుందా రాదా అనే దాని మీద ఫిలిం నగర్ సర్కిల్స్ లో కొత్త చర్చలు మొదలయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఒకపక్క వేగంగా జరుగుతున్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయట.

ఒకవేళ ఇప్పుడు తేదీ ప్రకటించి దానికి కట్టుబడకపోతే నెగటివ్ మార్క్ తో పాటు ఇతర నిర్మాతల రిలీజ్ ప్లాన్స్ కు ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది కాబట్టి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. బర్త్ డేకు ఇంకో పాతిక రోజులు టైం ఉంది కాబట్టి ఆలోగానే పూర్తి క్లారిటీ ఉంటే బెటర్. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో సైరా కనక అక్టోబర్ 2 డేట్ వదులుకుంటే మళ్ళీ సంక్రాంతి దాకా మంచి ఛాన్స్ ఉండదు. కానీ ఇప్పటికే అల్లు అర్జున్ – మహేష్ బాబు ఆ సీజన్ కి ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు ప్రకటించారు కూడా.

ఇప్పుడు సైరా కూడా అప్పుడే వస్తానంటే ఇబ్బందులు తప్పవు. విజువల్ గ్రాండియర్ కాబట్టి వీలైనంత పోటీ లేకుండా విడుదల సెట్ చేసుకోవడం సైరాకు చాలా ముఖ్యం. ఇప్పటికైతే అక్టోబర్ 2కు అలాంటి ఇబ్బందేమీ లేదు. కానీ వదులుకుంటే మాత్రం సమస్య జటిలం అవుతుంది. దీని గురించే రామ్ చరణ్ టీమ్ సీరియస్ డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ ఆగస్ట్ 22న రిలీజ్ కు సంబంధించి ఖచ్చితమైన డేట్ చెప్పకపోతే మాత్రం వాయిదా వార్త నిజమే అన్న నిర్ధారణకు రావొచ్చు. చూద్దాం
Please Read Disclaimer