ఆ కల నెరవేరిందిగా

0

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు చీప్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నాడు అనగానే చాలా మంది కోరుకున్నది అనుకున్నది చిరంజీవి మరియు విజయశాంతిని ఒక్క ఫ్రేమ్ లో చూడాలి అని. రెండు మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి మరియు విజయశాంతిల కాంబోలో వచ్చిన సినిమాలు సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరిద్దరు కలిసి అత్యధిక సినిమాలు చేశారు. అంతటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అంతటి క్రేజీ కాంబో ఏదో కారణం వల్ల చాలా ఏళ్లుగా లేదు. కనీసం ఆ సూపర్ హిట్ జోడీని ఒక్క ఫ్రేమ్ లో అయినా చూడలేమా అని వీరి జోడీని అభిమానించే వారు చాలా మంది అనుకున్నారు.

ఇన్నాళ్లకు అప్పటి వీరి జంటను అభిమానించిన అభిమానుల కల నెరవేరేలా సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఈ కలయిక జరిగింది. ఒక్క ఫ్రేమ్ లో చాలా కాలం తర్వాత చిరంజీవి మరియు విజయశాంతిలు కలిసి కనిపించడంతో చాలా మంది కళ్లు చాలా పెద్దగా అవుతున్నాయి. ఈ జంటను అభిమానించే వారు గతంలోకి వెళ్లి పోయి వారి సినిమాల తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. మొత్తానికి ఈ కలయికకు కారణం అయిన మహేష్ బాబుకు అంతా కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు.

చాలా ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతిని ఇలా చూడటం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా చిరంజీవి పక్కన ఆమెను మళ్లీ ఇన్నాళ్లకు చూడటం చాలా సంతోషంగా ఉందంటున్నారు. మద్యలో మహేష్ బాబు లేకుండా ఇద్దరు పక్కన పక్కన ఉంటే ఇంకా బాగుండేదని అనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తానికి సింగిల్ ఫ్రేమ్ లో చిరంజీవి.. విజయశాంతిని చూడాలనుకున్న కల నెరవేరినట్లే.
Please Read Disclaimer