మా డైరీ లాంచ్.. రాజశేఖర్ పై చిరు అసహనం

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో వివాదాల గురించి తెలిసిందే. తొలి నుంచి మా వివాదాలు పరువు మర్యాదల్ని మంట కలుపుతూనే ఉన్నాయి. మాలో నిధి దుర్వినియోగం అంటూ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా పై నేటి అధ్యక్షుడు సీనియర్ నరేష్ ఆరోపించడం మొదలు మీడియా లో మా అలుసై పోయింది.

అయితే ఆ వివాదం అప్పటి తో ముగిసి పోలేదు. ఇప్పటికీ అలానే ఉంది. నరేష్ – శివాజీ రాజా మధ్య వైరం ఇప్పటికీ సద్ధుమణగలేదు. మొన్న కార్తీక మాసం వనభోజనాల్లో సైతం ఇది బయట పడింది. వన భోజనాలకు అధ్యక్షుడైన నరేష్ రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అంతకు ముందే సీనియర్ నరేష్ కి వ్యతిరేకం గా జీవిత- రాజశేఖర్ బృందం మా సభ్యులతో ఈసీ మీటింగ్ నిర్వహించడం వివాదమైంది.

ఆ వివాదాలన్నీ చిలువలు పలువలు గా పెరుగుతున్నాయే కానీ ఏమాత్రం మార్పు అన్నదే లేదు. మా ఫౌండర్ అధ్యక్షుడు.. పరిశ్రమ పెద్ద మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా పూనుకున్నా మా వివాదాల్ని పరిష్కరించలేక పోవడంపై మా సభ్యుల్లోనే ఆసక్తికర చర్చ సాగుతోంది. అధ్యక్షుడు నరేష్ తో కమిటీ కీలక సభ్యుడైన రాజశేఖర్ ప్రతిసారీ ఘర్షణ పడుతుండడం బయటపడింది. నరేష్ ఒంటెద్దు పోకడ మా సభ్యులకు నచ్చడం లేదని జీవిత- రాజశేఖర్ – హేమ వర్గం తీవ్రం గా ఆరోపిస్తోంది.

తాజాగా మా – 2020 డైరీ ఆవిష్కరణ లో మరోసారి వివాదం బయటపడింది. అయితే ఈసారి మా సీనియర్ మెంబర్ అయిన పరుచూరి గోపాల కృష్ణ నుంచి హీరో రాజశేఖర్ మైక్ లాక్కోవడం వేదిక పై పెద్దలకు నచ్చలేదు. మీటింగ్ లో రాజశేఖర్ ఇలా ప్రవర్తించడం తో ఆ ఘటన నచ్చని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్ అలిగి అక్కడి నుంచి వాకౌట్ చేశారు. మా డైరీ ఆవిష్కరణ రసాభాస గురించి ప్రస్తుతం మెంబర్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Please Read Disclaimer