#2020 దసరా: చిరు-రజనీ-యశ్ ముక్కోణపు ఫైట్

0

2020 సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. రెండు పెద్ద సినిమాల మధ్య అసాధారణ పోటీ వేడెక్కించింది. ప్రమోషన్ సహా బాక్సాఫీస్ కలెక్షన్స్ పరమైన పోటీ వాతావరణం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. అదే తీరుగా మరో పెద్ద పండగ ముందుందని తాజా సన్నివేశం క్లియర్ కట్ గా చెబుతోంది.

సంక్రాంతి తరహాలోనే #2020 దసరాకి నువ్వా నేనా? అనే రసవత్తరమైన పోటీ జరగనుందని క్లారిటీ వచ్చేసింది. ఈసారి దసరా బరిలో టాప్ స్టార్లు ఎవరు? అంటే… ఇద్దరు వెటరన్ హీరోలు దసరా వార్ కి రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి- సూపర్ స్టార్ రజనీకాంత్ దసరా బరిలో పందేనికి దిగుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీళ్లకు తోడు కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసిన యశ్ కూడా పోటీబరిలో నిలిచాడు.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉందింకా. ఇక మరో వెటరన్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దరువు శివ తెరకెక్కిస్తున్నఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కూడా తెలుగు- తమిళంలో అత్యంత భారీగా విడుదల కానుంది. అయితే ఆ ఇద్దరితో పాటు దసరా రేస్ లోకి వచ్చాడు యశ్. అతడు నటిస్తున్న తాజా చిత్రం కేజీఎఫ్ 2 పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు – తమిళం- హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 రిలీజ్ అంటూ ఇప్పటికే కేజీఎఫ్ 2 బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సంచలన విజయం నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడాల్సి ఉండగా.. అటు రజనీకాంత్ లాంటి స్టార్ తో యశ్ పోటీపడాల్సిన సన్నివేశం ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-