అమేజింగ్ మెగా ఫ్రెండ్స్

0

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఈ వీకెండ్ పార్టీ హాట్ టాపిక్. `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో పదో వార్షికోత్సవ వేడుకల్ని మెగాస్టార్ స్వయంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు-తమిళం-మలయాళం-కన్నడ రంగాలకు చెందిన 40 మంది స్టార్లు పాల్గొనడంతో అన్ని పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుక ఆద్యంతం ఎంతో సందడిగా సాగిందని ఇప్పటికే రిలీజైన ఫోటోలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ వేడుకల్లో స్టార్లు అంతా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ లతో సందడి చేశారు.

అదంతా ఒకెత్తు అనుకుంటే.. మెగాస్టార్ చిరంజీవితో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అనుబంధానికి సంబంధించిన ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. మోహన్ లాల్ స్వయంగా ఈ ఫోటోని షేర్ చేసి మెగాస్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. “అమేజింగ్ ఫ్రెండ్ చిరంజీవి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీలో“ అంటూ ఓ ఫోటోని రివీల్ చేశారు. ఈ ఫోటోలో మగాస్టార్ భుజాల మీదుగా చేతులు వేసి ఎంతో ఆప్యాయంగా ఫోటో దిగారు మోహన్ లాల్. ఇద్దరు టాప్ స్టార్లు ఒకే ఫ్రేమ్ లోకి రావడంతో ఆ ఫోటోకి అంతే డిగ్నిటీ వచ్చింది. ఇక ఈ ఫ్రేమ్ లో రజనీకాంత్- కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు మిస్సవ్వడం కొంత వెలితి అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం చిరు-లాల్ కాంబినేషన్ ఫోటో మెగాభిమానుల్లో వైరల్ గా షేర్ అవుతోంది. ఈ ఫోటోని పరిశీలనగా చూస్తే .. పార్టీ లో బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్ కోడ్ మాత్రమే కాదు.. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాస్ట్ లీ చేతి గడియారాలు దర్శనమిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చేతికి.. అలాగే మోహన్ లాల్ చేతికి సేమ్ టు సేమ్ ఒకే తరహా వాచ్ లు ఉన్నాయి. బ్లాక్ బెల్ట్ గోల్డ్ డయల్ తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఈ వాచ్ లు.
Please Read Disclaimer