చిరు 152 .. డబుల్ రోల్ ట్విస్టు

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 152వ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్ డేట్ అందినా మెగా ఫ్యాన్స్ లో ఎగ్జయిట్ మెంట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

సోషియో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని దేవాలయ భూముల కబ్జా నేపథ్యంలో పొలిటికల్ భూ మాఫియా అంశాన్ని కొరటాల టచ్ చేస్తున్నారని రకరకాలుగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. గోవింద్.. ఆచార్య అనే రెండు విభిన్నమైన పాత్రల్లో మెగాస్టార్ ఫ్యాన్స్ కి ట్రీటిస్తారట. అందులో ఒక కథానాయికగా ఇప్పటికే త్రిషను ఫైనల్ చేశారు. వేరొక కథానాయిక కోసం ప్రయత్నాల్లో ఉన్నారట. అలాగే బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారని ఇప్పటికే ప్రచారం ఉంది.

అయితే మెగాస్టార్ ద్విపాత్రాభినయం గురించిన సమాచారం అధికారికంగా రివీల్ కావాల్సి ఉంది. ఇక చిరుకి డబుల్ రోల్ చేయడం కొత్తేమీ కాదు. గోవిందుడు అందరివాడేలే – రౌడీ అల్లుడు- బిల్లా రంగా- రిక్షావోడు- స్నేహం కోసం వంటి చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. 90లలో ఎన్నో చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. బాస్ లోని మాస్ ని క్లాస్ ని బయటకు తీసిన సినిమాలెన్నో. వాటన్నిటి కంటే భిన్నంగా ఈ చిత్రంలో చిరుని చూపించేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారట.
Please Read Disclaimer