సైరా సెట్స్ లోనే CHIRU 152

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం ఇటీవల రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ శివారులోని కోకాపేటలో నిర్మించిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సెరా సెట్స్ ని సద్వినియోగం చేస్తున్నారని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి కోసం అప్పట్లో కోకాపేట్ లో భారీ సెట్లు నిర్మించారు. అవేవీ ఇంకా చెక్కు చెదరలేదుట.

దీంతో ఆ సెట్లను కూడా అవసరం మేర ఉపయోగించుకోమని యూనిట్ కి చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ చరణ్ సూచించారట. తాజా చిత్రానికి పనికొస్తాయనుకుంటే అవసరమైన చోట వాటిని రీమోడల్ చేసుకుంటే బాగుంటుందని టీమ్ భావిస్తోందిట. దీని వల్ల నిర్మాతలకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక సైరా సెట్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి సెట్స్ నిర్మించారు. దీంతో అవన్నీ స్ట్రాంగానే ఉన్నాయి. సెట్ లోపల 1857 శతాబ్ధం నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేసారు. అవన్నీ తాజా సినిమాలో పాటలకు సంబంధించిన షూట్స్ కి వినియోగించడానికి అనువుగా ఉంటాయి.

అయితే వాటిని ఆర్ట్ డైరెక్టర్ తన విజన్ కు తగ్గట్టు రీక్రియేట్ చేసుకుంటే బావుంటుదని భావిస్తున్నారు. మరి చరణ్ స్మార్ట్ ఐడియాని టీమ్ ఎంతవరకూ ఆచరణలో పెడతారో చూడాలి. ప్రస్తుతం కోకా పేటలో ఓ పాట చిత్రీకరణ సహా కీలక మైన సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ కి జోడీగా ఎవరిని ఎంపిక చేసారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్రిష నే కథానాయికగా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతున్నా యూనిట్ నుంచి అధికారిక సమచారం లేదు. దీంతో హీరోయిన్ విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది.
Please Read Disclaimer