ఆయనలో.. ‘ఓ కర్ణుడు అర్జునుడు ధర్మరాజు’ ఉన్నారన్న మెగాస్టార్

0

నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో దివంగత దర్శకుడు నటుడు నిర్మాత దాసరినారాయణ రావుగారి 77వ జయంతి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. దాసరి అనే పేరుకు ఆయన స్టైల్ లో అర్థం చెప్పారు. ఆయన ట్వీట్ లో.. ‘దా..దానంలో కర్ణుడుమీరు స..సమర్ధతలో అర్జునుడు మీరు రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’ అంటూ చిరు ట్వీట్ చేశారు. దాసరితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు చిరు. ఇక ఫిలిం ఛాంబర్లో దాసరి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్ దాసరి అరుణ్ కుమార్ కోడి పద్మ కొమర వెంకటేష్. రాజేంద్ర కుమార్ బంగారు బాబు పి.డి.ప్రసాద్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ మా గురువుగారు దాసరిగారి జయంతి మే 4ను డైరెక్టర్స్ డేగా గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఈరోజును ఈ కరోనా వల్ల డైరెక్టర్స్ అందరూ లేకుండా సింపుల్గా చేయాల్సి వచ్చిందన్నారు. సినీ ఇండస్ట్రీలో దాసరిగారి పేరు గుర్తుండేలా వచ్చే ఏడాది ఆయన జయంతికి పలు మంచి పనులు చేస్తామన్నారు. 1947 మే 4న దాసరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత సినిమా దర్శకుడిగా.. రచయితగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా దాసరి నారయణ రావు ఎన్నో సేవలు చేశారు. దాసరి గారు అత్యధిక సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం పొందారు. దాదాపు 150 చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. 53 సినిమాలకు ఆయన నిర్మాతగా పనిచేశారు. ఆయన లేని ఈ సినీ ఇండస్ట్రీ ఇంకా ఆయన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home