చుక్కల్లో చంద్రుడి లా బాసూ గ్రేసూ

0

ఎనభైలలో స్టార్లు ఓచోట చేరి సందడి చేస్తున్నారు అంటే అంతా ఓల్డ్ ఏజ్ కదా! ఔట్ డేటెడ్ పార్టీలో ఏం సందడి ఉంటుందిలే అనుకున్నారు. అయితే అలా తక్కువ అంచనా వేసినవాళ్లంతా ముక్కున వేలేసుకునే రేంజులో ఉందీ సీను.

అసలు నాటి మేటి తారలంతా ఏ లెవల్లో చెలరేగారో ఈ ఫోటోషూట్లు చూస్తే అర్థమవుతుంది. సీనియర్ భామలంతా చుక్కల్ని తలపిస్తే.. వీళ్ల మధ్య చంద్రుడిలా మెగాస్టార్ చిరంజీవి సందడి మామూలుగా లేదు. స్టారాధి స్టార్లు ఎందరు ఉన్నా మెగాస్టార్ వేరయా విశ్వధాభిరామ! అన్న చందంగానే ఉందీ సన్నివేశం. అటూ ఇటూ ఆయనతో ఫోటో కోసం రెట్రో స్టైల్లో భామలంతా ఎలా రెడీ అయిపోయారో చూడండి. ఖుష్బూ.. సుహాసిని అయితే సంథింగ్ స్పెషల్ గా రెడీ అయ్యి మరీ ఈ వేడుకలకు ఎటెండయ్యారు. బ్లాక్ – గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైనర్ శారీల్లో తళుక్కుమని మెరిశారు.

వయసు తో పనేం ఉంది.. మనసుండాలే కానీ అన్నంతగా చెలరేగి పోయారంతే. టైమ్ మెషీన్ కాస్త వెనకటి కాలానికి గిర్రున తిరిగి వెళితే మళ్లీ టీనేజర్లు అయిపోవాలన్న కోరిక లేక పోలేదని అర్థమవుతోంది. సాక్షాత్తూ ఆ ఇంద్ర లోకపు దేవేంద్రుడే స్వయంగా ప్రత్యక్షమై కొంచెం అమృతం మిగిలింది.. కావాలా? అని ప్రశ్నిస్తే ఏమిటో సన్నివేశం!!
Please Read Disclaimer