చిరు సరసం: పదిహేనళ్ల తర్వాత వచ్చినా అదే ఫిగరు.. అదే అందం?

0

పబ్లిక్ ఫంక్షన్ లో ఒక సీనియర్ నటుడు.. మరో సీనియర్ నటిని ఉద్దేశించి పొగిడేస్తూ మాట్లాడటం తప్పేం కాదు. కానీ.. అందులో సరసం మోతాదు మించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. సీనియర్ నటి విజయశాంతి మీద చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడే చిరు.. తన తీరుకు భిన్నంగా మాట్లాడిన వైనం ఆశ్చర్యానికి గురి చేసింది.

64 ఏళ్ల వయసులో చిరు..తనతో ఇరవై సినిమాలు చేసిన ఒక సీనియర్ నటి రీ ఎంట్రీ సినిమా ఫంక్షన్ లో ఆమె అందాన్ని వర్ణించిన తీరు సరికాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. సినిమా డైలాగును కాస్త మార్చి చెప్పినా.. ఇప్పుడీ టైంలో అలాంటి వర్ణన బాగోలేదని చెప్పాలి.

ఒక సందర్భంలో విజయశాంతిని చూస్తుంటే గుండె కొంచెం కిందకి జారుతోందన్న సరదా వ్యాఖ్య చేసినా.. సరసం మోతాదు మించిందని చెప్పక తప్పదు. పదిహేనేళ్ల తర్వాత వచ్చినా సరిలేరు నీకు.. ఈ సినిమాతో అదే గ్లామర్.. అదే పొగరు.. అదే ఫిగరు.. అదే అందం.. అదే సొగసు అంటూ డైలాగ్ మోడ్ లో విజయశాంతిని పొగడ్తల వర్షం కురిపించేశారు చిరంజీవి.

తనను అలా పొగిడేస్తున్న వైనంతో విజయశాంతి నవ్వుతూ ఉండిపోయారు. కానీ.. కొన్ని సందర్భాల్లో కలుగజేసుకొని మాట్లాడిన మాటలు.. అక్కడకు హాజరైన వారికే కాదు.. లైవ్ లో ప్రోగ్రాం చూస్తున్న వారికి ఎంటర్ టైన్ చేశాయి. ఎంత క్లోజ్ అయినప్పటికీ.. కొంత వయసు తర్వాత కొన్ని మాటలు కొందరి నోటి నుంచి రావటం అంత బాగోదు. కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి. విజయశాంతి అందాన్ని పొగడాలనుకుంటే.. ‘ఫిగరు’ లాంటి పదాలు చిరు లాంటి నటుడి నోటి నుంచి రావటం బాగోలేదని చెప్పక తప్పదు. సరసం తప్పేం కాదు.. కానీ మోతాదు మించితేనే తిప్పలన్నీ. తాజాగా చేసిన వ్యాఖ్యలో అదే జరిగింది.
Please Read Disclaimer