రష్మీకపై ఫన్నీ కౌంటర్ వేసిన మెగాస్టార్

0

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన స్పీచ్ ఆధ్యంతం కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్బంగా ఆయన హీరోయిన్ రష్మిక మందన్న గురించి మాట్లాడుతూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కు రష్మిక మందన్న మాత్రమే కాకుండా స్టేడియంలోని జనాలు మరియు టీవీల ముందు ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా నవ్వుకున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. రష్మిక చాలా అందమైన చురుకైన అమ్మాయి. అమ్మాయి చాలా హుషారైన అమ్మాయి. రష్మిక నన్ను కాంట్రాక్ట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మొదటి సినిమా ‘ఛలో’ వేడుకకు నేను ముఖ్య అతిథిగా వెళ్లాను. ఆ తర్వాత గీత గోవిందం సినిమా మా వాళ్లది కదా అని వెళ్తే అక్కడ రష్మిక ఉంది. ఇక్కడ మహేష్ బాబు పిల్చాడు కదా అని వస్తే ఇక్కడ కూడా రష్మిక ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే రష్మిక నన్ను ఏమైనా కాంట్రాక్ట్ తీసుకుందా అనుమానం వస్తుంది అంటూ ఫన్నీ కౌంటర్ వేశాడు.

చిరంజీవి మాటలకు రష్మిక చాలా గట్టిన నవ్వుతూ దండం పెట్టి కృతజ్ఞతలు తెలియజేసింది. రష్మిక మొదటి చిత్రం ఛలో మరియు తర్వాత సినిమా గీత గోవిందంలకు చిరంజీవి గెస్ట్ గా వెళ్లాడు. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఇప్పుడు రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు కూడా వచ్చాడు కనుక ఈ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటూ మెగా మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Please Read Disclaimer