99 రోజుల్లో చిరు 152 చిత్రం

0

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి దాదాపు ఏడాదిన్నర తెరకెక్కించి ఉంటారు. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన సైరా చిత్రం తర్వాత చిరంజీవి చేయబోతున్న చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. సైరా ఆలస్యం అయిన కారణంగా తదుపరి చిత్రంను కాస్త త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల శివను కోరడం జరిగిందట. నేడు జరిగిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా చిరంజీవి తన 152వ చిత్రం గురించిన కీలక ప్రకటన చేశాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కేవలం నాలుగు అయిదు నెలల్లో పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు వృదా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. బయ్యర్లు.. నిర్మాతలు అంతా కూడా లాభం పొందుతారు. అందుకే సినిమాలు తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. నా 152వ చిత్రంను కూడా త్వరగా పూర్తి చేయాలని కొరటాలకు చెప్పిన సమయంలో ఆయన 100 రోజుల లోపే పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చాడు అన్నాడు.

కొరటాల శివను తన వద్దకు పిలుచుకుని శివ జనాల ముందు కమిట్ అవుతున్నాను వంద రోజులకు ఒక్క రోజు కూడా ఆలస్యం అవ్వకుండా మన సినిమాను పూర్తి చేయాలంటూ చిరంజీవి సున్నితంగా నవ్వుకుంటూ వార్నింగ్ లా ఇచ్చాడు. అందుకు కొరటాల శివ స్పందిస్తూ 99 రోజుల్లో తప్పకుండా పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చాడు. కనుక మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఈ ఏడాది సమ్మర్ చివరి వరకు రెడీ అయ్యే అవకాశం ఉంది. అదీ కాదంటే దసరా వరకు మెగా 152 చిత్రం రావడం కన్ఫర్మ్. అతి త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
Please Read Disclaimer