మహేశ్ లో ఎవరికి తెలీని యాంగిల్ చెప్పిన చిరు

0

ఒక అగ్రహీరో సినిమాకు ఓకే అన్నంతనే అడ్వాన్స్ ఇవ్వటం మామూలే. కానీ.. సినిమా అయ్యే వరకూ డబ్బులు తీసుకోని అగ్రహీరో ఉంటారా? అంటే.. నో అనేస్తాం. కానీ.. ఇకపై అలా అనటానికి వీల్లేదు. రికార్డెడ్ గా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన విషయం ఇప్పుడు సంచలనంగానే కాదు.. మహేశ్ మీద మరింత గౌరవాన్ని పెంచేలా చేసిందని చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరూ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. మహేశ్ బాబును తెగ పొగిడేశారు. మహేశ్ గురించి తెలీని విషయాల్ని కూడా చెప్పేశారు. మహేశ్ చాలా అందంగా ఉంటాడని.. ఆ అందం వెనుక చిలిపితనం ఉంటుందన్న చిరు.. కొన్ని నెలల క్రితం పేపర్ తిరగేస్తుంటే మహేశ్ ఫోటో కనిపించిందని.. చూడగానే కత్తిలా ఉందన్నారు.

ఆ లుక్ తనను కట్టి పడేసిందని.. వెంటనే ఆ విషయాన్ని చెబుతూ మహేశ్ కు మెసేజ్ చేశానన్నారు. అలా జరిగిన కొద్ది నెలలకే సినిమా పూర్తయిందని చెప్పారన్నారు. అతి తక్కువ సమయంలో ఈ సినిమాను తీశారన్న చిరు.. ఇండస్ట్రీలో తక్కువ టైంలో సినిమాలు తీయాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక హీరో సినిమా తీయటానికి ఏడాదికి పైనే పడుతుందని.. ఆ టైం తగ్గాలన్నారు. ఈ సినిమా పూర్తి అయ్యే వరకూ మహేశ్ ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిసిందని.. తాను కూడా తన సినిమాలకు ఎప్పుడు అడ్వాన్స్ తీసుకోనని చిరు చెప్పారు. తాను అడ్వాన్స్ తీసుకోకుంటే నిర్మాతకు కలిసి వస్తుందన్న సెంటిమెంట్ ఉందన్న మాటను చిరు వెల్లడించారు. ఇప్పటి రోజుల్లో రెమ్యునరేషన్ కు సంబంధించి ఒక్క పైసా కూడా ముందు తీసుకోకుండా సినిమా పూర్తి చేయటం మహేశ్ లోని మరో కోణాన్ని అందరికి తెలిసేలా చిరు మాటలు ఉన్నాయని చెప్పాలి.
Please Read Disclaimer