ట్విట్టర్ వేదికగా పూరీ పై సెటైర్ వేసిన మెగాస్టార్

0

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో టచ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. @KChiruTweets పేరుతో ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించిన చిరంజీవి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో చిరు ఎంట్రీపై టాలీవుడ్ స్టార్లు అందరూ స్పందిస్తూ మెగాస్టార్ కి వెల్కమ్ చెప్పారు. నాగార్జున మహేష్ బాబు మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు దర్శకులు చిరంజీవికి ఘన స్వాగతం పలికారు. అయితే ఈ జాబితాలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. చిరు కి వెల్కమ్ చెబుతూ.. సోషల్ మీడియా కి స్వాగతం సామాజిక దూరం పాటిస్తున్న సమయంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి మెగాస్టార్ కూడా స్పందించారు.

పూరీకి థ్యాంక్స్ చెబుతూనే సటైర్స్ వేశారు. కరోనా ఎఫెక్ట్ తో మంచి ఫ్యామిలీ టైం లభిస్తోంది అని వ్యాఖ్యానించారు. ముంబై బ్యాంకాక్ బీచ్ లని మిస్ అవుతుంటావు కానీ పవిత్ర ఆకాష్ నీతో సమయం గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు అని చిరు ట్వీట్ చేసాడు. దీనికి ప్రతిగా అన్నయ్యా లవ్ యూ అంటూ పూరీ కూడా ట్వీట్ చేసాడు. వీరిద్దరి మధ్య మొదటి నుంచి మంచి రిలేషన్ ఉంది. వాస్తవానికి మెగాస్టార్ రీఎంట్రీగా చెప్పబడే సినిమాకి పూరీయే డైరెక్షన్ చేయాల్సింది. చిరంజీవి 150వ సినిమా చేసేందుకు పోటీ పడిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. చిరు కోసం పూరి ఆటోజానీ కథని రెడీ చేశారు. అది చిరుకి నచ్చింది. కానీ సెకాంఢాఫ్ విషయంలో చిరు సందేహాలు వ్యక్తం చేయడం తో ఆ ప్రాజెక్ట్ కాస్తా ఆగిపోయింది. అయితే పూరీ జగన్నాథ్ చిరు తో ఎప్పటికైనా సినిమా చేస్తా అని గతంలో ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పుడు తాజాగా వీరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ చూసిన సినీ అభిమానులు త్వరలోనే వీరి కలయికలో మూవీ వస్తే బాగుండు అనుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-