బామ్మగా ఏంటీ హీరోయిన్ గా నటించాలి : చిరు

0

తెలుగు లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు వేడుక నిన్న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఏఎన్నార్ జాతీయ అవార్డును మొన్నటి తరం ప్రముఖ హీరోయిన్స్ అయిన శ్రీదేవి మరియు రేఖలకు ఇవ్వడం జరిగింది. అవార్డు వేడుకకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున చాలా సరదాగా కార్యక్రమాన్ని నడిపించాడు. ఆయన మాటలతో నవ్వు తెప్పించాడు. ఈ సందర్బంగా నాగ్ మాట్లాడుతూ శ్రీదేవి గారితో సినిమాలు చేసే అవకాశం అదృష్టం దక్కింది. అలాగే రేఖ గారితో కూడా నటించే అవకాశం ఇస్తే సంతోషం అన్నాడు.

నాగార్జున మాటలకు రేఖ స్పందిస్తూ తప్పకుండా చేస్తాను. మీకు బామ్మగా నటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. రేఖ గారి మాటలకు పక్కనే ఉన్న చిరంజీవి స్పందించారు. మీరు బామ్మ పాత్ర ఏంటీ రేఖ జీ మీరు ఇప్పటికి హీరోయిన్ గా నాగార్జునతో నటించవచ్చు. నాగార్జున ద్విపాత్రాభినయంతో ఒక సినిమా చేయాలి. అందులో తండ్రి కొడుకులుగా నాగార్జున నటిస్తే తండ్రి పాత్రకు జోడీగా మీరు నటిస్తే బాగుంటుందని చిరంజీవి అన్నారు.

చిరు మాటలకు అక్కడున్న వారు అంతా కూడా చప్పట్లతో మద్దతు తెలిపారు. రేఖ కూడా తప్పకుండా అన్నట్లుగా గట్టిగా నవ్వేశారు. ఈ వయసులో కూడా రేఖ మూడు పదుల వయసు ఉన్న హీరోయిన్స్ కు పోటీ ఇవ్వగలదు అంటూ సినీ వర్గాల వారి అభిప్రాయం. అందుకే చిరంజీవి అలా మాట్లాడాడు. బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో నటించిన రేఖ ఇంకా నటించేందుకు ఆసక్తిగానే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. సౌత్ కు చెందిన 65 ఏళ్ల రేఖ తెలుగులో భవిష్యత్తులో నటించే అవకాశాలు ఉన్నట్లుగా ఆమె మాటల ద్వారా తెలుస్తోంది.
Please Read Disclaimer