బన్నీకి చిరు ఇచ్చిన హామీ ఏంటీ?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. అల్లు అరవింద్- ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో రిలీజవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత బన్నీ- త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. తమన్ అందించిన గీతాలు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లో 10 కోట్ల (వంద మిలియన్) వ్యూస్ ని అధిగమించి రికార్డు క్రియేట్ చేయడం తో ఈ సినిమా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ సంక్రాంతి బరిలో మొదటి స్థానంలో నిలిచింది.

ఇదే సమయంలో మహేష్ `సరిలేరు నీకెవ్వరు` .. `అల వైకుంఠపురములో` రిలీజ్ తేదీలు ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్నాయి. అయితే అంతకంటే ముందే ఇరు బృందాలు ఎవరికి వారు ప్రీరిలీజ్ వేడుకను బ్లాక్ బస్టర్ చేయించే హడావుడిలో ఉన్నారు ఇక సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కి అనూహ్యంగా మెగా హీరో చిరంజీవి వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనవరి 5న ఈ కార్యక్రమాన్ని ఎల్బీస్టేడియంలో మహేష్ అశేష అభిమానుల మధ్య నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే `అల వైకుంఠపురము`లో వేడుకకు మెగాస్టార్ వస్తారా రారా! అంటూ బన్ని అభిమానుల్లో చర్చ సాగుతోంది. జనవరి 6న మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో యూసఫ్ గూడాలోని పోలీస్ లైన్స్ లో ఓ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ వస్తారా రారా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇదిలా వుంటే అల్లు అర్జున్ కు చిరు హామీ ఇచ్చారని ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్కచింది. ఏంటా హామీ? అని అప్పుడే ఆరాలు మొదలయ్యాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం చిరు వస్తానని అల్లు అర్జున్ కు మాటిచ్చారట. మ్యూజికల్ కాన్సర్ట్ అయి పోయిన తరువాత ఏపీలోని కీలక పట్టణంలో `అల వైకుంఠపురములో` కోసం ప్రీరిలీజ్ ఈ వెంట్ ని చిత్ర బృందం ప్లాన్ చేసిందని.. ఆ కార్యక్రమానికి చిరు చీఫ్ గెస్ట్ గా పాల్గొంటారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తుననాయి. ఒకవేళ ఇదే నిజమైతే సంక్రాంతి బరిలో రెండు భారీ చిత్రాలకు మెగాస్టార్ ముఖ్య అతిధి అన్నమాట.
Please Read Disclaimer