పవన్ పై చిరు చేసిన వ్యాఖ్యలు వైరల్

0

మెగాస్టార్ చిరంజీవి నిన్న సాయంత్రం జరిగిన ‘అర్జున్ సురవరం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు చాలా బాగా నచ్చడం వల్ల ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు చిరంజీవి వచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ వేడుక వేదికపై చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక చెగువేరా సాంగ్ ఉంది. ఆ పాటలో చెగువేరాను చూస్తున్నంత సేపు నాకు ఒక్కరే గుర్తుకు వచ్చారు. అనగానే జనాలు భారీగా మొత్తుకుంటూ పవన్ పవన్ పేరును ఉచ్చరించారు. అప్పుడు ఔను పవన్ కళ్యాణ్ అంటూ పవన్ లాగా మెడపై చేయి పెట్టి చిరంజీవి నిమురుకుంటూ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. చెగువేరను చూస్తుంటే తన తమ్ముడు పవన్ ను చూస్తున్నట్లుగా ఉంది అంటూ అనగానే అభిమానులు మరియు ప్రేక్షకులు గట్టిగా మొత్తుకున్నారు.

పవన్ కళ్యాణ్ గురించి ఈమద్య కాలంలో చిరంజీవి పలు వేదికలపై మాట్లాడుతూ ఉన్నాడు. గతంతో పోల్చితే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారని మెగా అభిమానులు అనుకుంటున్నారు. ఒకరి నోట మరొకరి పేరు వచ్చినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు ఉండటం లేదు. తాజాగా అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Please Read Disclaimer