పవన్ తో హీరోయిన్ గా చేయాలని ఆమెను చిరు సతీమణి ఇంటికి పిలిచి అడిగారట

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించేందుకు.. ఆయనతో జత కట్టేందుకు ఎంతోమంది అగ్ర నటీమణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది.. పవన్ సరసన నటించేందుకు చిరు సతీమణి సురేఖ ఇంటికి పిలిచి మరీ ఒక నటిని అడిగారా? అన్న మాటే ఆస్తికరం. అవును.. ఆ మాట నిజమని చెబుతోంది సీనియర్ నటి రాశీ.

ఒక దశలో తెలుగు ప్రేక్షకుల్ని తన అందాలతో పిచ్చెక్కించిన రాశీ.. పవన్ తో కలిసి గోకులంలో సీత సినిమాలో చేయటం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన నటించేందుకు తనను మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇంటికి పిలిచి మరీ సినిమా చేయాలని కోరినట్లు రాశీ వెల్లడించింది. తన మరిది కెరీర్ కోసం చిరు సతీమణి ఎంతలా ఆరాట పడ్డారో తాజా మాటలు స్పష్టం చేస్తాయని చెప్పాలి.

వదిన సురేఖను తల్లితో పోలుస్తుంటారు పవన్ కల్యాణ్. రాశీ మాటలు చూస్తే.. తన కొడుకు చెర్రీ కోసం కూడా సురేఖ ఇలా చేసి ఉండరేమో? ఏమైనా.. పవన్ కల్యాణ్ పక్కన నటించేందుకు రాశీ ఒప్పు కోవటానికి కారణం చిరు వైఫ్ అన్న కొత్త విషయాన్ని తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.
Please Read Disclaimer