చిన్నారి చెర్రీతో చిరంజీవితం

0

క్యూట్ గా ఉన్నాడు.. బోసి నవ్వులు నవ్వుతున్నాడు.. అల్లరి వేషం వేస్తున్నాడు.. డాడీతో మురిపెంగా ఆటలాడుకుంటున్నాడు.. ఎవరీ పసి పాపాయి? అలా ఆటలాడుకుంటున్న చిన్నారి చరణ్ ని గుర్తు పట్టడం మెగా ఫ్యాన్స్ కి కష్టమేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి గెటప్ చూస్తుంటే క్లాసిక్ డేస్ లో షూటింగ్ లొకేషన్ లోని ఫోటో ఇదని అర్థమవుతోంది..

మంచి దొంగ.. దొంగ మొగుడు.. శివుడు శివుడు శివుడు .. యముడికి మొగుడు .. లాంటి క్లాసిక్ చిత్రాల్ని తెరకెక్కించిన నాటి సీజన్ లో చిరంజీవి గెటప్ ని స్ఫురిస్తోంది. ఓవైపు నిరంతరం షూటింగుల హడావుడిలో చిరంజీవి ఎంతో బిజీగా గడిపేస్తున్నా ఫ్యామిలీ లైఫ్ ని మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. అందుకే ఆయన ఫ్యామిలీస్ మెచ్చే స్టార్ అయ్యారు. ఇదిగో షూట్ గ్యాప్ లో ఖాళీ సమయాన్ని ఇలా తనయుడు రామ్ చరణ్ తో స్పెండ్ చేశారు. ఓ వైపు సెట్స్ లో శ్వేధం చిందిస్తూనే ఇలా కొంత సమయాన్ని గడిపే అవకాశం తనకు కలిగిందన్నమాట. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా చిరు ఈ రేర్ గిఫ్ట్ ని ఫ్యాన్స్ కి అందించారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-