అగ్ని కీలల్లో హాలీవుడ్ స్టార్స్ పరుగులు

0

ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియో అడవుల్లో కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అడవి చాలా భాగం అగ్నికి ఆహుతైంది. ఇంకా మంటలు చెలరేగుతునే ఉన్నాయి. ప్రభుత్వం ఓ పక్క అదుపులోకి తీసుకొచ్చే చర్యలు కొనసాగిస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా ఆ కార్చిచ్చు హాలీవుడ్ స్టార్స్ కి నెలవైన లాస్ఏంజిల్స్ ను తాకింది. సెలబ్రిటీలు ప్రముఖులు అత్యంత సంపన్నులు ఉండే బ్రెంట్ వుడ్ ప్రాంతం సహా పలు శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది. దీంతో అనేక విల్లాలు దగ్దమయ్యాయి. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అగ్నీకీలలు ఎగిసిపడటంతో సెలబ్రిటీలు కట్టు బట్టలతోనే బయటకు పరుగులు తీసారు.

బ్రెంట్ వుడ్ లో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. నటుడు ఆర్నాల్డ్ ష్క్వాజ్ నెగర్ సహా పలువురు సెలబ్రిటీలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ లిబ్రోన్ జేమ్స్ భార్య ఇంటికి నిప్పు అంటుకోవడంతో ముగ్గురు పిల్లలతో ఉన్నపళంగా పరుగులు తీసింది. ఆ ఇంటిని సుమాన్ 23 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారణంగా ఆర్నాల్డ్ కొత్త చిత్రం `టెర్మినేటర్ : డార్క్ ఫేట్` రెడ్ కార్పెట్ కార్యక్రమాన్ని రద్దు చేసారు.

ప్రస్తుతం బ్రెంట్ వుడ్ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మి ఉంది. హాలీవుడ్ సినిమా స్టైల్లో హెలికాప్టర్లు – విమాన ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈఘటనతో ఒక్కసారిగా అమెరికాలో ఉండే తెలుగు ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని కీలలు ఎటు నుంచి ఎగసి పడుతున్నాయో అర్ధం కాకపోవడంతో విదేశీలు – స్వదేశీయులు అనువైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సెలబ్రిటీల ఇళ్లకు – ఆస్తులకు జరిగిన నష్టాన్ని అధికారులు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer