ఈ యంగ్ హీరోల టైమింగ్ అదిరింది

0

పెళ్లి చూపులు ఫేం రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా ‘చూసి చూడంగానే’ అనే చిత్రంతో పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన సందర్బంగా యంగ్ హీరోలు కార్తికేయ మరియు శ్రీవిష్ణులు గెస్ట్ లుగా హాజరు అయ్యారు. ఆ సమయంలో వారిద్దరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారు టైమింగ్ తో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు సుమ హోస్టింగ్ చేసిన విషయం తెల్సిందే. ఆమె మామూలుగానే కార్యక్రమాన్ని చాలా సరదాగా మార్చడంలో ముందు ఉంటారు. అలాంటిది యంగ్ హీరోలతో ఆమె మాట్లాడించిన తీరు ఆకట్టుకుంది. కార్తికేయ మాట్లాడేందుకు వచ్చిన సమయంలో పక్కనే ఉన్న సుమ మీరు శివను కాంపీటీషన్ గా అనుకుంటారా లేదంటే ఎంకరేజ్ చేయాలని అనుకుంటారా అంటూ సుమ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు కార్తికేయ ఏమాత్రం ఆలోచించకుండా ఎంకరేజ్ చేసేందుకు నేనేమైనా చిరంజీవినా అన్నాడు. ఖచ్చితంగా శివ నాకు కాంపిటీషన్ అనుకుంటున్నాను. శివను మొదటి సారి చూసినప్పుడే ఏమున్నాడు. ఖచ్చితం గా సినిమాల్లోకి ఇతను వస్తే నాకు కాంపిటీషన్ అవుతాడు అనుకున్నాను అంటూ కార్తికేయ సరదాగా మాట్లాడాడు. శివ పెద్ద హీరో అవ్వాలని.. అతడికి ఈ చిత్రంతో పాటు ముందు ముందు చేయబోతున్న సినిమాలు కూడా సక్సెస్ లుగా నిలవాలని కోరుకుంటున్నాను అన్నాడు.

ఇదే కార్యక్రమంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ చిత్రంతో శివ మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. తన సొంత నిర్మాణ సంస్థకు ఆయనే డేట్లు ఇవ్వలేనంత బిజీ అవ్వాలి. అలాగే తన కొడుకుతో మాత్రమే కాకుండా కొత్తవారితో ఇంకా చాలా సినిమాలను రాజ్ కందుకూరి గారు నిర్మించాలి. స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలని నిర్మాతలంతా అనుకుంటున్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే వారు చాలా తక్కువ అవుతున్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో మీరు ముందు ఉంటారు. అందుకే మీరు మీ కొడుకుతో మాత్రమే కాకుండా కొత్త వారితో కూడా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. కొత్త వారిని ఇండస్ట్రీ కి తీసుకు రావాలని ఆశిస్తున్నాను అంటూ టైమింగ్ తో శ్రీవిష్ణు మాట్లాడి అక్కడున్న వారిలో నవ్వులు పూయించాడు.
Please Read Disclaimer