లంచం తీసుకున్న ఎస్ఐ న్యాయం చేయలేదంటూ ఏసీబీకి నటి ఫిర్యాదు!?

0

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు మరియు నటి సాయి సుధల విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో శ్యామ్ కే నాయుడు ఫోర్జరీ సంతకంతో కూడిన పత్రంను సమర్పించి ఆమెతో రాజీ కుదిరినట్లుగా చెప్పాడు. అయితే తాను రాజీకి ఒప్పుకోలేదు అంటూ సాయి సుధ చెప్పడంతో మళ్లీ కేసు మొదటికి వచ్చింది.

రాజీ కోసం తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించడంతో పాటు ఆమె సంతకంను ఫోర్జరీ చేసినందుకు గాను కొత్త కేసులు కూడా ఆయనపై నమోదు అయ్యాయి. ఆయన బెయిల్ కూడా రద్దు అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇలాంటి సమయంలో మళ్లీ సాయి సుధ మీడియా ముందుకు వచ్చింది. ఈసారి తాను ఎస్ ఆర్ నగర్ ఎస్ఐకి అయిదు లక్షల లంచం ఇచ్చినట్లుగా సాయి సుధ ఏసీబీకి తెలియజేసింది. శ్యామ్ కే నాయుడుపై కేసు నమోదు చేసేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు అంటూ ఆమె ఏసీబీకి తెలియజేసింది.

తన వద్ద అయిదు లక్షల లంచం తీసుకున్న ఎస్ఐ ఇప్పటి వరకు తనకు న్యాయం చేయక పోవగా ప్రత్యర్థికి సాయం చేస్తున్నాడు అంటూ ఆమె ఆరోపించింది. తన వద్ద లంచం ఇచ్చినట్లుగా ఎస్ఐ తీసుకున్నట్లుగా ఉన్న సాక్ష్యాలను ఏసీబీ ముందు సాయి సుధ ఉంచింది. దాంతో ఈ వ్యవహారం మరింత కాంప్లికేటెడ్ అయ్యింది. శ్యామ్ కే నాయుడుతో పాటు పోలీసులు కూడా ఇప్పుడు బాధ్యులుగా మారారు. లంచం ఇచ్చినందుకు గాను సాయి సుధ కూడా కేసు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.