ఆ నవ్వుకు అర్థం ఏంటి తలైవా?

0

కొన్ని ఫొటోల్లో నీగూఢమైన అర్థం దాగి వుంటుంది. ఫోటోలో కనిపించే ఫేసే ఫేజ్ ఏంటో చెప్పేస్తుంటుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ లైఫ్ స్ట్రగుల్! ఆ ముఖంలోని బాధ.. ఆవేదన.. దుఃఖం లేదా సంతోషం ఇవన్నీ ఇలా చూడగానే ఇట్టే కనిపెట్టేయొచ్చు. తలైవా ఈ ఫోటో చూడగానే మీకైతే ఏమనిపిస్తోంది?

ది గ్రేట్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ బంధించిన ఛాయాచిత్రమిది. అందులో పెద్ద సీక్రెటే దాగి వుంది. పరీక్షగా చూస్తే ఆ సీక్రెట్ ఏంటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. తలైవా రజనీకాంత్ నటించిన `దర్బార్` చిత్రం జనవరి 9న తెలుగు- తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీగా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మునుపెన్నడూ లేనంతగా గ్రాండ్ గా భారీ హంగామా నడుమ శిల్పకళా వేదిక లో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమం లో సూపర్స్టార్ రజనీకాంత్- మురుగదాస్- లైకా అధినేత.. నిర్మాత సుభాస్కరన్- అనిరుధ్- కమెరామెన్ సంతోష్ శివన్ పాల్గొన్నారు. రజనీ గత చిత్రాలకు మించి అట్టహాసం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెమెరామెన్ సంతోష్ శివన్ ఓ ఫొటోని తీశారు. రజనీ స్మైల్ వెనక ఆ అర్థం ఏమిటో! ఆయన ఓవైపు నవ్వుతుంటే నిర్మాత సుభాస్కరన్ ముఖంలో మాత్రం ఎలాంటి నవ్వు కనిపించడం లేదు. ఏదో తెలీని ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ఈసారి సన్నివేశమేమిటో! అన్నది ఆ ఫేస్ ఎక్స్ ప్రెషన్ లో కనిపిస్తోంది. సుభాస్కరన్ వరుసగా రజనీతో రెండు చిత్రాల్ని నిర్మించారు. అందులో ఒకటి `2.ఓ` భారీ స్థాయిలో నష్టాల్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు `దర్బార్` పరిస్థితి ఏంటా అన్నది సుభాస్కరన్ ఫీలింగ్ ఫొటోలో కనిపిస్తోంది. దర్బార్ రిలీజై బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటేనే ఆ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పూర్తిగా మారతాయనడంలో సందేహం లేదు. సెంటిమెంటు పరిశ్రమలో ఒకే ఒక్క హిట్టు అన్నిటినీ మార్చేస్తుంది. ఆ టైమ్ ఈసారి రజనీకి వస్తుందా? జస్ట్ వెయిట్..
Please Read Disclaimer